YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విద్యావంతులైతే రాష్ట్రం ఆర్థికంగా పరుగులు తీస్తుందనేది ముఖ్యమంత్రి ఆలోచన

విద్యావంతులైతే రాష్ట్రం ఆర్థికంగా పరుగులు తీస్తుందనేది ముఖ్యమంత్రి ఆలోచన

విద్యావంతులైతే రాష్ట్రం ఆర్థికంగా పరుగులు తీస్తుందనేది ముఖ్యమంత్రి ఆలోచన
– పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి
తిరుపతి, మే, 27
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక శక్తి,  విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆద్యాపకులు నీతిని బోధించి పిల్లలను ఆదర్శవంతులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ పై ఉందని ఉప ముఖ్యమంత్రి, వాణిజ్య ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణ స్వామి అన్నారు. బుధవారం మనపాలన – మీ సూచన 3వ రోజు కార్యక్రమం లో విద్యకు ప్రాధాన్యతపై సమీక్ష , అభిప్రాయ సేకరణ  ఉపముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగగా అతిధులుగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , శాసన మండలి సభ్యులు యండవల్లి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి కావాలని పట్టుదలతో ముఖ్యమంత్రి మొదటి వ్యక్తి అయితే,  పంచాయితీరాజ్ శాఖ మంత్రి రెండవ స్థానంలో ఉన్నారని తెలిపారు. నీతి వంతమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారని , పేదల కు వరంలా విద్యను అందిస్తున్నారని అన్నారు. అధ్యాపకులు  చిన్న వయస్సు పిల్లల నుండే మీ భోదన అవినీతి రహితం, మద్యపాన నిషేదం ఉపయోగాలను పిల్లలకు భోదించి ముఖ్యమంత్రి ఆశయానికి మీరు తోడు కావాలని అన్నారు. పేదలకు విద్యకు అందాలనే తపన ముఖ్యమంత్రి ఆశయం అని దానికి మనం పూర్తి సహరించాలని అన్నారు. చాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలనపై ముఖ్యమంత్రి  పూర్తిగా సంక్షేమం పై దృష్టి పెట్టారని, విమర్శలు రాకుండా మరింత పటిష్ట అమలుకే అయిదు రోజుల మేధోమదనం రోజుకో అంశంపై ప్రజల నుండి స్పందనలు స్వీకరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి 3600 కి.మీ  పాదయాత్రలో  స్వయంగా ప్రజలను కలిసి వారి భాధలు విని గుంటూరు లో కేవలం 2 పేజీల మేనిఫెస్టోతో ముందుకెళ్లి ముఖ్యమంత్రి పదవి చేపట్టి సంక్షేమం పై దృష్టి పెట్టారని , ఇక అభివృద్ధికి నాంది పలకనున్నారని  అన్నారు. రాష్ట్రంలోని 46 వేల పాఠశాల లను మూడు విడతల్లో మాడరన్ స్కూల్స్ గా రూపు దిద్దుకొనున్నాయని అన్నారు . ఇందులో పంచాయతీ రాజ్ శాఖ నుండే 60 శాతము నిధులు ఖర్చు చేస్తున్నారని అన్నారు.  గత ప్రభుత్వం చెల్లించని ఫీజ్ రీయంబర్స్మెంట్ రూ.1800 కోట్లు చెల్లించారని, అమ్మ ఒడి, విద్యా  దీవెన కు  ప్రాధాన్యతనిస్తున్నారని కారణం విద్యావంతులు అయితే ఆర్థికంగా ఏదుగుతారని , అప్పుడే రాష్ట్రం కూడా ఆర్థికంగా బాగుపడుతుందనే ఆలోచన మన ముఖ్యమంత్రిదని అన్నారు. విమర్శలకు తావు లేని పరిపాలన లక్ష్యం కావాలని  అన్నారు. 
శాసన మండలి సభ్యులు యండవల్లి  శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ వినూత్న కార్యక్రమంతో దేశంలో  ఎక్కడా జరగని నాడు –నేడు కార్యక్రమం మన రాష్ట్రంలో చేపట్టి పాఠశాలలు, కళాశాలల  అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు.  మద్యాహ్న భోజనం మార్పులు నాణ్యమైన బియ్యం అందిస్తున్నారని , నాడు నేడు మొదటి విడతలో 1517 పాఠశాలలు , 12 మున్సిపాల్ పాఠశాలలు  అన్ని సౌకర్యాలతో విద్యుత్, టాయిలెట్స్ , త్రాగునీరు, కాంపౌండ్ వాల్స్ వంటి 9 రకాల వసతులు జూలై  31 నాటికి మొదటి విడత పూర్తికానునన్నాయని  అభినందనీయమని , దీనికోసం సహకరిస్తున్న ఎస్.ఎస్.ఏ, ప్రధానోపాధ్యాయులు  కృషి ప్రశంసనీయం అని అన్నారు. నేడు కార్పొరేట్ విద్యా ప్రాబల్యం తగ్గుతున్నదని, 500 మంది కార్పొరేట్ విద్యార్థులు ఉన్న కళాశాలలో ట్రస్ట్  ఏర్పాటు ఆదేశాలు ఇవ్వడం వంటివి శుభ పరిణామమని అన్నారు . జూనియర్ కళాశాలలో నీట్, ఎంసెట్ కోచింగ్ ఏర్పాటు చేయాలని, లెక్చరర్ల  పదోన్నతులు, రేగులరైజేషన్, తరగతి విద్యా భోదనలో పాటు ఆన్ లైన్ విద్యా భోదనల ప్రాధాన్యత ఇవ్వాలని, స్మార్ట్ బోర్డు ఏర్పాటు, కళాశాలలలో ఉన్న 70 శాతం ఖాళీలను భర్తీ చేయాలని, గతంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 లో ఇచ్చిన పదోన్నతులు తరువాత జరగలేదని  తెలిపారు. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు  భోధన మార్పు ఉపాధ్యాయ వృత్తి చేసిన నేను స్వాగతిస్తున్నానని అన్నారు .
 

Related Posts