YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కార్మికుల హక్కులను కాలరాస్తారా? ప్రియాంక ఫైర్

కార్మికుల హక్కులను కాలరాస్తారా? ప్రియాంక ఫైర్

కార్మికుల హక్కులను కాలరాస్తారా? ప్రియాంక ఫైర్
లక్నో మే 27 
‘మైగ్రేషన్ కమిటీ’ని ఏర్పాటు చేసి, యోగి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వరించిన కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తుందా? అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కార్మికులకు సహాయం చేయాల్సింది పోయి... తమ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ పనుల నిమిత్తమై వలస కార్మికులను తీసుకెళ్లకూడదన్న నిబంధన విధించడం ఏంటని ఆమె మండిపడ్డారు.కార్మికులను ప్రభుత్వం కట్టేయాలని చూస్తోందా? వారి హక్కులను కాలరాయాలని చూస్తోందా? అని ట్విట్టర్ వేదికగా  తీవ్రంగా ధ్వజమెత్తారు. వలస కార్మికలు సమస్యలను సానుభూతి కోణంలో పరిష్కరించాల్సింది పోయి... సమస్యను జటిలం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో తాము రాజకీయాలు చేయమని, ప్రభుత్వానికి ఈ విషయంలో సహాయకారిగా ఉంటామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.

Related Posts