YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

 పత్తి మద్దతు ధర ఎంత ఎవరు కొనుగోలు చేస్తారు అనే విషయాలు ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే పంట మార్పిడి : బీజేపీ రమణారెడ్డి

 పత్తి మద్దతు ధర ఎంత ఎవరు కొనుగోలు చేస్తారు అనే విషయాలు ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే పంట మార్పిడి : బీజేపీ రమణారెడ్డి

 పత్తి మద్దతు ధర ఎంత ఎవరు కొనుగోలు చేస్తారు అనే విషయాలు
ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే పంట మార్పిడి : బీజేపీ రమణారెడ్డి
కామారెడ్డి మే 27
తెలంగాణ ప్రభుత్వం వచ్చే వాన కాలం పంట పండించే విధానం లో నియంత్రిత వ్యవసాయ విధానం ప్రవేశ పెట్టడం ద్వారా రైతు తన భూమిలో తనకు నచ్చిన, తన భూమికి అనువైన పంట పండించుకోలేని దుస్థితి ఎదురైతుందని రైతులు వాపోయినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తెలిపారు. ఈ రోజు దోమకొండ, ముత్యంపేట , సంగమేశ్వర్ గ్రామాలలో రైతుల అభిప్రాయాల సేకరణలో భాగంగా పర్యటించడం జరిగింది. రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారని, గత మూడు సంవత్సరాల క్రితం రాష్టంలోని ప్రతి రైతుకు ఉచితంగా ఎరువులు పంపిణి చేస్తా అని మాట యిచ్చి ఇప్పటికి ఒక్క బస్తా ధాన్యం కూడా ఇవ్వ లేదని. మల్లి ఇప్పుడు వచ్చి తనకు ఇష్టమైన పంటను రైతులు పండించాలని షరతులు పెడుతున్నాడని, రెండు సంవత్సరాల క్రితం పత్తి వద్దని ఇప్పుడు పత్తి పెట్టమంటున్నాడు ఇదెక్కడి చోద్యమని అన్నారు.రైతు తాను ప్రభుత్వం చెప్పిన విధంగా పండిస్తే సన్న వడ్ల కు మద్దతు ధర ఎంత, పత్తికి మద్దతు ధర ఎంత, కొనుగోలు ఎవరు చేస్తారు వీటి విషయంలో వ్యవసాయ అధికారులు , ప్రభుత్వం హామీ ఇచ్చి తర్వాత గ్రామాలలో తీర్మానాలు చేయాలని లేని పక్షంలో పాత పద్ధతిన పంటలు పండిస్తామని రైతులు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు  నాగర్తి చంద్రరెడ్డి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
 

Related Posts