YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

పరమాత్మ ఉనికి

పరమాత్మ ఉనికి

పరమాత్మ ఉనికి
భూమిమీద, సముద్రంలో, గాలిలో, అగ్నిలో, దిక్కుల్లో, రేయింబవళ్ళు, సూర్య చంద్రాదుల్లో, ఓంకారంలో... ఇలా అన్ని చోట్లా ఉన్నారాయన. 'ఆయనే దగ్గరున్నా, ఆయన దగ్గరున్నా ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఆయన అండ ఉంటే సిరిసంపదలకు లోటు ఉండదు. ఆ ఒక్కడే ఎందరితోనో సమానం. ఆ ఒక్కడూ నిర్లిప్తుడైతే జగమంతా శూన్యం. ఇంతకీ ఎవరాయన? ఎలా, ఏ రూపంలో, ఎక్కడ ఉంటాడు? ఆయన ఎవరికి దగ్గరవాడు? ఎవరికి దగ్గరవుతాడు? ఎవరు దగ్గర చేసుకోగలరు? ఎవరికి, ఎలా, ఎందుకు, ఎప్పుడు చిక్కుతాడు- ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం భాగవతం చెబుతోంది. ఆయన పేరు పరమాత్మ. ఆయన ఎవరికీ చిక్కకపోతే, ఎవరి ఆలోచనలకి అంతుపట్టక పోతే- అలాంటి ఆయన కోసం ఎందుకీ తహతహ! ఈ సూటి ప్రశ్నకు సమాధానం ఆయన జగ దాధారుడు కాబట్టి... ' అని. అలాంటి వాడే అందరికీ అందుబాటులో ఉండాలి ఉంటే అలాంటి అడిగే వారున్నారు. అలాంటివారికి సమాధానంగా... ఏ మానవుడు ధర్మమార్గాన నడుచుకోడో వాడు చదువుకున్నా మూరుడే. భౌతికంగా ధనికుడైనా ఆధ్యాత్మిక ధనం లేకపోతే నిరు పేద. శారీర కంగా బలవంతుడైనా మానసికంగా శక్తిహీనుడే. ధర్మాన్ని అనుసరించక పోతే మనిషి పుట్టిన పశు సమా నుడే అంటూ భాగవతంలో అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పారు. , ఆయన అనుగ్రహం కోసం చేయ చేసిందల్లా... మనసు ఆయన పాదాలపైన, పలుకులు ఆయన గుణాలు వల్లె వేయడం పట్ల, చేతులు ఆయన మందిరాన్ని అలంకరించడం పట్ల, చెవులు ఆయన కాగానే శ్రవణా అభిలాషతో, చూపులు ఆయన రూప వీక్షణాభిలాషతో, శిరస్సు ఆ మూర్తికి కైమోడ్పులు చేస్తూ, పాదాలు ఆయన మందిరం వైపు దారి తీనేవి, మనసు ఆయనయందే లగ్నమైనదిగా ఉండాలి. అలా అయిననాడు ఆయనే తనంత తానుగా వశమవుతారు. ఆయన వశమయ్యే పరిస్థితులను భాగవతంలో చెప్పిన సందర్భాలు మచ్చుకు కొన్ని. 
ప్రథమ స్కంధము లో- ముని శ్రేష్ఠుడు రాసిన భాగవతాన్ని సదృక్తితో వినాలనే కోరిక ఉన్నవారి మనసుల్లో తనంతట తానే చిక్కుబడిపోతాడు మాధవుడు' అని స్పష్టంగా చెప్పాడు గ్రంథకర్త. ద్వితీయ స్కంధం- ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధి దైవికాలనే తాపత్రయాల వెంట పరుగులు తియ్యడంతోనే మానవ జీవితం గడిచిపోతుంది. అందువల్ల పర మాత్మను తలుచుకోవడానికి సమయం చిక్కని పరిస్థితి చాలామందికి ఉంది. ఆ పరిస్థితి నుంచి తప్పించుకుని పరమార్దమేదో దాన్ని మాత్రమే మనసులో నిలిపి, అనుసరించే వారి మనసుల్లో ఆ పరమాత్మ తనంత తానుగా కొలువై ఉంటాడని భాగవతం చెబుతుంది. నశించేది శరీరం మాత్రమేనని, ఆత్మ కాదని నిజానికి ఆత్మకు మరణం అనేది లేనేలేదని తెలుసుకుని మసలడాన్ని సాంఖ్యయోగం అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి గురించి అత్యున్నతమైన వాస్తవ జ్ఞానం సాంఖ్యం. అది సర్వ మానవాళికి అత్యంత ఆవశ్యకమైంది. ఆ జ్ఞానం కలిగి ఉంటే ధర్మనిష్ఠ కలుగుతుంది. అది కలిగిననాడు ఏదో ఒక సమయంలో ఆ పరమాత్మ గురించినచింత ఏర్పడుతుంది. అది ఏర్పడిన వారిని ఆ అంతర్యామి వెదుక్కుని వచ్చి మరీ వారికి వశమవుతాడని భాగవతం చెబుతోంది.

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts