YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శబ్ద చికిత్స "శీతలాదేవి" స్త్రోత్రం 

శబ్ద చికిత్స "శీతలాదేవి" స్త్రోత్రం 

. శబ్ద చికిత్స "శీతలాదేవి" స్త్రోత్రం 
సమస్త అంటురోగాలను, వైరస్ వ్యాధుల ప్రభావము పడకుండా శ్రీ  శీతలాదేవి కాపాడుతుందని శాస్త్రోక్తి. ఆవిడ అనుగ్రహానికై రూపాన్ని ధారణ చేసి, ... ప్రార్థన చేసుకోవాలి.
అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః - అనుష్టుప్ ఛన్దః - శీతలా దేవలా దేవతా - లక్ష్మీర్బీజం - భవానీశక్తిః -సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః
ఈశ్వర ఉవాచ:
వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్!
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్!!
వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్!
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్!!
శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః!
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి!!
యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః!
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే!!
శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ!
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్!!
శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్!
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ!!
గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్!
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్!!
నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే!
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్!!
మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్!
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే!!
అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా!
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే!!
శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః!
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్!!
శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా!
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః!!
రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః!
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః!!
ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్!
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే!!
శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్!
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై!!
*ఫలస్తుతి*
విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర,, నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు ఋషులు సూక్ష్మ జగత్తులో ఉన్న శక్తి ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు.
జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి’
గాడిద, చేట, చీపురు, కలశం - ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు.
స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు - తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. "శీతలా" నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం.
శ్రీ మాత్రే నమః

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts