YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 ఖమ్మంలో మిర్చి పంట టెన్షన్

 ఖమ్మంలో మిర్చి పంట టెన్షన్

 ఖమ్మంలో మిర్చి పంట టెన్షన్
ఖమ్మం, మే 28,
జిల్లాలోని కొన్ని కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన పంట నాణ్యత దెబ్బతినడంపై జిల్లా మార్కెటింగ్‌ అధికారి (డీఎంవో) విచారణ పూర్తిచేసి కలెక్టర్‌కు నివేదికను సమర్పించారన్న సమాచారం నేపథ్యంలో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి. కోల్డ్‌ స్టోరేజీల్లోని పంట నాణ్యత దెబ్బతిన్నదంటూ రైతులు ఆందోళనకు దిగడంతో డీఎంవో రంగంలోకి దిగారు. సంబంధిత మార్కెట్‌ కమిటీల బాధ్యులతో, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేయించారు. కొన్నింటిని స్వయంగా తనిఖీ చేశారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు ఇచ్చినట్లు సమాచారం. ఆ నివేదికలో ఏమున్నదోనన్న ఉత్కంఠ నెలకొంది. కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేయడానికి ముందే పంట నాణ్యత దెబ్బతిన్నదా...? నిల్వ చేసిన తరువాత కోల్డ్‌ స్టోరేజీల నిర్వాహకుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణమా..? అనేది చర్చనీయాంశంగా మారింది. మిర్చి క్వింటాల్‌ ఒక్కింటికి అనూహ్యంగా రూ.21వేల వరకు ధర పలకడంతో జిల్లావ్యాప్తంగా ఆయా కోల్డ్‌ స్టోరేజీల్లోని పంటను రైతులు బయటకు తీసుకొచ్చారు. అంతలోనే లాక్‌డౌన్‌ విధింపు, మార్కెట్‌లో క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో ఆ మిర్చి రైతులు తిరిగి కోల్డ్‌ స్టోరేజీల బాట పట్టారు. కేవలం పది రోజుల్లోనే కోల్డ్‌ స్టోరేజీలన్నీ మిర్చిబస్తాలతో నిండాయి. సాధారణంగా ఇలా నిల్వ చేసిన పంట నాణ్యతను సదరు రైతులు పక్షం లేదా నెలకోసారి చూసుకుంటుంటారు. తల్లాడ, ఖమ్మం రూరల్‌, ఖమ్మం నగరంలోని కోల్డ్‌ స్టోరేజీల్లోని తమ మిర్చి పంటను వారు ఇటీవల చూశారు. రంగు మారడాన్ని గమనించి, నాణ్యత దెబ్బతిన్నదంటూ ఆందోళనకు దిగారు.రైతుల ఆందోళన నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. పది రోజులుగా ప్రత్యేక బృందాలు జిల్లాలోని కోల్డ్‌ స్టోరేజీలను విస్తృతంగా తనిఖీ చేశాయి. సమగ్ర నివేదికను కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు డీఎంవో సమర్పించినట్లు తెలిసింది. అందులో ఏమున్నదోనని కోల్డ్‌ స్టోరేజీల నిర్వాహకులు, రైతులు ఉత్కంఠతో ఉన్నారు. అధికారుల గణాంకాల ప్రకారం... జిల్లాలో 38 కోల్డ్‌ స్టోరేజీలు పూర్తిగా మిర్చి బస్తాలతో నిండాయి. చింతపండు తదితరాల నిల్వకు ఉద్దేశించిన కోల్డ్‌ స్టోరేజీల్లో కూడా ఈ సంవత్సరం మిర్చి బస్తాలు నిల్వ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Related Posts