YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కోవిడ్19 ని  నిర్ధారించే RT-PCR* పరీక్ష ను  ప్రయివేట్ ల్యాబ్ లు లేదా ప్రయివేట్ వ్యక్తుల  ద్వారా నిర్వహించుట  కొరకు చెల్లించే  ధర

కోవిడ్19 ని  నిర్ధారించే RT-PCR* పరీక్ష ను  ప్రయివేట్ ల్యాబ్ లు లేదా ప్రయివేట్ వ్యక్తుల  ద్వారా నిర్వహించుట  కొరకు చెల్లించే  ధర

కోవిడ్19 ని  నిర్ధారించే RT-PCR* పరీక్ష ను  ప్రయివేట్ ల్యాబ్ లు లేదా ప్రయివేట్ వ్యక్తుల  ద్వారా నిర్వహించుట  కొరకు చెల్లించే  ధర నిమిత్తం  తగిన వ్యూహం అమలుపరచడం. భారతదేశంలో  తగిన కోవిడ్19 పరీక్షా సదుపాయాలను  అందుబాటులోకి తేవటానికి మరియు దానిని    సులభతరం చేయడానికి ఎప్పటికప్పుడు  ICMR ముందుగానే రాష్ట్రాలను  సంప్రదిస్తోంది. ప్రస్తుతానికి కోవిడ్19  పరీక్ష కోసం 428 ప్రభుత్వ మరియు 182 ప్రైవేట్ ల్యాబ్‌లు అందుబాటులో  ఉన్నాయి. ఇవి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు మరియు యుటిలలో విస్తరించి ఉన్నాయి. వివిధ ICMR సంస్థల  వద్ద సృష్టించబడిన పరీక్షా వస్తు సామగ్రిని మరియు కారకాలను 16 పంపిణీ డిపోల ద్వారా అందించడానికి ICMR శాయశక్తులా కృషి మరియు ప్రయత్నాలు చేస్తోందిప్రారంభంలో కోవిడ్19 మహమ్మారి కారకాలను పరీక్షించే కిట్లు కొరకు  ప్రపంచం లో పెద్ద ఎత్తున సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్19 వైరస్ల యొక్క పరమాణు గుర్తింపు కోసం దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై ఇండియా  ఎక్కువగా ఆధారపడింది. 2O2O మార్చి మధ్య వరకూ కోవిడ్19 వైరస్ నిర్ధారణ  కోసం నిర్వహించే  RT-PCR పరీక్ష కోసం వసూలు చేసే రేట్లు దేశంలో అందుబాటులో లేవు. దిగుమతి చేసుకున్న కోవిడ్19 పరీక్ష కిట్ ధర మరియు పరీక్షను నిర్వహించడానికి చేసే ప్రయత్నాలలో అయ్యే ఇతర ఖర్చుని దృష్టిలో ఉంచుకుని ఒక కోవిడ్19  పరీక్ష యొక్క గరిష్ట రుసుము రూ.4,500లు మించరాదని ICMR 17-03-2020 న నిర్ణయించడం జరిగింది..ఈ మధ్య కాలంలో స్థానిక కంపెనీలను హ్యాండ్‌ హోల్డింగ్ చేసి వాటి ద్వారా స్వాబ్ లను, శాంపిల్స్ రవాణా పరికరాలు, మరియు RNA వెలికి తీసే కిట్లు వంటి  వస్తు సామగ్రిని స్థానికంగా తయారు చేసే సులభతరం చేసి ప్రోత్సహించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇంకా ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన RTPCR పరీక్ష నిర్వహించుటకు గాను  స్వదేశీ డయాగ్నొస్టిక్ కిట్లు ఆమోదించబడుతున్నాయి. దీనికి సమాంతరంగా జిల్లా ఆసుపత్రులు మరియు  PHC ల  స్థాయిలో కోవిడ్19  పరీక్షా విధానంగా కొరకు  ట్రూ నాట్ విధాన  ఆధారిత పరీక్ష ధృవీకరించబడి చేర్చబడినది. CBNAAT / GeneXpert మరియు Abott HIV వైరల్ లోడ్ పరీక్ష యంత్రాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారమ్‌లను చేర్చడం కోవిడ్19 పరీక్షల పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. మొత్తానికి, RT-PCR పరీక్షల కోసం దేశీయంగా అభివృద్ది పరచడం, పరీక్షించి ధృవీకరించడం మరియు పరీక్ష సామగ్రిని  ఇతర దేశాలకు ఉత్పత్తితో పాటు కోవిడ్19 పరీక్షలకు సంబంధించి మౌలిక సదుపాయాలను పెంచడానికి సమిష్టి ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం కోవిడ్19 పరీక్ష సామాగ్రి నిలకడగా అందుబాటులో ఉండడం వలన చాలామంది స్థానిక మార్కెట్ నుండి ఇటువంటి కోవిడ్19 పరీక్షల  సామగ్రిని సేకరించడం ప్రారంభించారు. స్వదేశీ తో సహా కోవిడ్19 పరీక్షా కిట్లు మరియు ఇతర వస్తు సామగ్రి యొక్క వైవిధ్యమైన ఎంపికల కారణంగా ధరలు పోటీగా మారి తగ్గుతున్నాయి. కోవిడ్19 ఒక మహమ్మారిగా ప్రకటించబడినది అని మనకు తెలుసు దీనిని పరీక్షల ద్వారా  సమర్ధవంతంగా కనిపెట్టుటకు గాను  lLl రోగ లక్షణ వ్యక్తులకు  నిర్వహించే  RT-PCR పరీక్షను ICMR గోల్డ్ స్టాండర్డ్‌గా పరిగణించి  సమర్థించడం  జరిగింది. ఈ నేపథ్యం మరియు కోవిడ్19 పరీక్షల కిట్లు  యొక్క పెరుగుతున్న  ధరలను దృష్టిలో ఉంచుకుని 17/3/2020 న విడుదల చేసిన ఆదేశాల మేర నిర్ణయించిన కోవిడ్19  పరీక్ష గరిష్ట  ధర రూ 4,500 ఇప్పుడు వర్తించదు. అందువల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు  యుటి అడ్మినిస్ట్రేషన్లు ఈ ప్రయోగశాలల ద్వారా పరీక్షించాలనుకునే ప్రైవేట్ వ్యక్తులు  మరియు  ప్రైవేట్ ల్యాబ్‌లతో చర్చలు జరపాలని  మరియు ప్రభుత్వం పంపే కోవిడ్19 నమూనాలను  పరీక్షించడం  కోసం ఇరువురు  చర్చలు జరిపి  పరస్పరం అంగీకరించే ధరలను నిర్ణయించాలని సూచించడం జరిగినది. సమయానుసార RAPID పరీక్ష అనేది విలువైన మానవ ప్రాణాలను వైరస్‌ నుండి తగిన  చికిత్సను అందించడం ద్వారా    కాపాడటానికి సూచించబడిన ప్రామాణిక ప్రోటోకాల్ అని భావించవచ్చు.
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ COVID19

Related Posts