YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ట్రంప్ ట్విటర్ మధ్య యుద్ధం..స్పందించిన సీఈఓ

ట్రంప్ ట్విటర్ మధ్య యుద్ధం..స్పందించిన సీఈఓ

ట్రంప్ ట్విటర్ మధ్య యుద్ధం..స్పందించిన సీఈఓ
న్యూ ఢిల్లీ మే 28        
అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్కు ట్విటర్కు మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ గొడవను సద్దుమణిగించేందుకు ఏకంగా ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే రంగంలోకి దిగారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయండి అన్నట్టు సీఈఓ ట్వీట్ చేశారు. ట్రంప్కు ట్విటర్ మీద ఎందుకు అంత కోపం రావడానికి గల కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల గురించి జరిగే తప్పుడు వివాదాస్పద సమాచారాన్ని తాము తెలియజేస్తూనే ఉంటామని ట్విటర్ సీఈఓ తెలిపారు. ఇది ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఈ మేరకు తాను ట్విటర్ను బహిష్కరిస్తానని ప్రకటించాడు. దీనికి సీఈఓ జాక్ స్పందించారు. తామేమీ తక్కువ కాదంటూ సీఈఓ ప్రతిస్పందన ఇచ్చారు. ఈ వ్యవహారం నుంచి మా ఉద్యోగులను వదిలేయండి అని కోరారు. ఒక కంపెనీగా.. అంటే తనకు సంబంధించినంత వరకు తమ ట్విటర్ చేపట్టే చర్యలకు తాను జవాబుదారీగా ఉండాల్సిందేనని గ్లోబల్ గా జరిగే ఎన్నికల గురించి సరికాని వివాదాస్పదమైన సమాచారాన్ని తాము పాయింట్ ఔట్ (వెలుగులోకి) చేస్తూనే ఉంటామని జాక్ మరోసారి స్పష్టం చేశారు. ఈ సమయంలో మా తప్పులేవైనా ఉంటే అంగీకరిస్తామని తెలిపారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలను హైలైట్ చేస్తూనే ఉంటామని దీనివలన ప్రజలు తమకు తామే ఏది నిజమో నిర్ణయించుకోగలుగుతారని జాక్ పేర్కొన్నారు. తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని ఇది క్రిటికల్ గా ఉండబట్టే తమ చర్యల వెనుక ఎవరున్నారో కొంతమంది గ్రహించగలుగుతారని వివరించారు. ఒక బ్యాలట్ పొందడానికి రిజిస్టర్ అవసరం లేదనే ఆలోచనకు వచ్చేలా నిన్నటి ట్వీట్లు కొన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయని రిజిస్టర్ అయిన ఓటర్లు మాత్రమే బ్యాలట్లను అందుకుంటారు.. కావాలంటే నిన్నటి ట్వీట్ల లింక్ని అప్డేట్ చేస్తున్నట్లు జాక్ ప్రకటించారు. ఓటింగ్ లో మెయిలింగ్ తో ఈ ఏడాది నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్కి కారణం కావచ్ఛునని ట్రంప్ చేసిన ట్వీట్టర్ ఖండించింది. ట్విటర్ పేర్కొన్న దానితో అమెరికాలో జరిగే ఎన్నికల్లో తన ఎన్నికపై దుష్ప్రభావం పడుతుందని ట్రంప్ భావించి ఈ మేరకు ట్విటర్తో వాగ్వాదానికి దిగారు. దీనికి ప్రతిగా సీఈఓ జాక్ చేసిన ట్వీట్కు ఏ విధంగా ట్రంప్ స్పందిస్తారో వేచి చూడాలి. ట్రంప్ చర్యను గమనిస్తుంటే ఎన్నికల్లో అవినీతి అక్రమాలకు వత్తాసు పలుకుతున్నట్టే తీరు కనిపిస్తోంది.

Related Posts