YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఇంజనీరింగ్ లో ఇంటర్న్ షిప్ తప్పనిసరి

ఇంజనీరింగ్ లో ఇంటర్న్ షిప్ తప్పనిసరి

ఇంజనీరింగ్ లో ఇంటర్న్ షిప్ తప్పనిసరి
విజయవాడ, మే 28
వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయబోతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి‌ తెలిపారు. మూడేళ్ల డిగ్రీ, నాలుగేళ్ల బీటెక్‌లో వేసవి సెలవులు, చివరి సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని వెల్లడించారు.అలాగే విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. సెప్టెంబరు నుంచి బోధన ఫీజులను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని.. వారే కాలేజీలకు వెళ్లి పిల్లల చదువు, మౌలిక వసతులను పరిశీలించి, ఫీజులు చెల్లిస్తారని చెప్పారు.సరైన సదుపాయాలను కల్పించకపోతే తల్లిదండ్రులు ఫిర్యాదు చేయొచ్చని..వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వసతి దీవెన కింద ఏడాదికి రెండు సార్లు రూ.10వేలు చొప్పున తల్లులకు అందజేస్తామని చెప్పారు.తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచి..ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలనుకున్నట్లు 96 శాతం మంది తల్లులు అభిప్రాయం చెప్పారని... అందుకోసం మండలానికో తెలుగు మీడియం పాఠశాల పెడుతూ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టాలని భావిస్తున్నామన్నారు.మొదట 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చి..విడతల వారీగా పదోతరగతి వరకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు

Related Posts