జూన్ 3 నుంచి పీజీ ఎంట్రన్స్ అడ్మిషన్లు
న్యూఢిల్లీ, మే 28,
ఆలిండియా కోటాలో పీజీ వైద్య విద్య రెండో విడత ప్రవేశాలకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. తొలి విడతలో సీట్లు పొంది, కేటాయించిన కళాశాలల్లో చేరని అభ్యర్థులు ఆ సీటును వదులుకునే గడువును జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ పెంచుతున్నట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తెలిపింది.అలాంటి వాళ్లు సీటును వదులుకుంటున్నట్లుగా సంబంధిత కాలేజీలకు ఈ-మెయిల్ ద్వారా గానీ, స్వయంగా వెళ్లి గానీ సమాచారాన్ని ఇవ్వొచ్చని సూచించింది. అనంతరం మిగిలిన సీట్లతో రెండో విడత ప్రవేశాలను నిర్వహిస్తామని వెల్లడించింది.పూర్తి షెడ్యూల్ ఇదే..!జూన్ 3 నుంచి 9వ తేదీ ఉదయం 10 గంటల వరకూ అర్హులైన అభ్యర్థులు తమ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.4 నుంచి 9వ తేదీ రాత్రి 11.55 గంటల వరకూ ఆన్‌లైన్‌లో పీజీ కోర్సులను ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవాలి.10, 11 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది.12వ తేదీ ఫలితాలను వెల్లడిస్తారు.సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 12-18 తేదీల మధ్య కేటాయించిన కళాశాలల్లో చేరాలి.గడువు తేదీ లోపు కాలేజీల్లో చేరని పక్షంలో ఆయా సీట్లను మిగిలిన సీట్ల కింద వెల్లడిస్తారు.రెండో విడత ప్రవేశాల మిగిలిన సీట్లను అఖిల భారత కోటా 50 శాతం సీట్ల ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు తిరిగి అందజేస్తారు. అఖిల భారత కోటా రెండో విడత ప్రవేశాలు జూన్ 18 వరకూ కొనసాగనున్న నేపథ్యంలో రాష్ట్ర కోటాలో రెండో విడత ప్రవేశాలు జూన్ మూడోవారం తర్వాత నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.