YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఆత్మస్తుతి, పరనిందలతో మహానాడు గుం

 ఆత్మస్తుతి, పరనిందలతో మహానాడు గుం

 ఆత్మస్తుతి, పరనిందలతో మహానాడు
గుంటూరు, మే 29,
చంద్రబాబు విధానం ఆత్మ స్తుతి, పరనింద అని విమర్శిస్తారు. ఎవరూ తమను తాము అతిగా పొగుడుకోరు, కానీ చంద్రబాబు అదే పనిగా తనను గొప్పగా చెప్పుకుంటారు. అదే సమయంలో ఇతరులను పూచిక పుల్లతో సమానంగా తీసేస్తారు. దీని వల్ల సాధించేది శూన్యమని ఇప్పటికే అర్ధమైనా కూడా బాబు మార్క్ పాలిటిక్స్ అలాగే సాగుతోంది. చంద్రబాబు నిజానికి మహానాడు అంటున్నా, హైదరాబాద్ లో కూర్చుని జామ్ యాప్ ద్వారా మీడియా మీటింగ్ పెట్టినా పార్టీ క్యాడర్ తో మాట్లాడినా, జనాలతో ఇంటరాక్ట్ అయినా కూడా చెప్పేది ఒక్కటే. అంతా రోటీన్ విమర్శలే ఉంటాయి. అధికార పార్టీని, జగన్ ని విమర్శించడమే అజెండాగా చేసుకుని మహానాడు జరపడం చంద్రబాబుకే చెల్లిందేమో.జాతీయ అధ్యక్షుడిని అని చంద్రబాబు చెప్పుకుంటారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ అక్కరలేదు కానీ రెండు దశాబ్దాల క్రితం వరకూ పాలించిన ఉమ్మడి రాష్ట్రంలో ఇంకా మనుగడలో ఉన్న తెలంగాణా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు పెద్దగా మాట్లాడకపోవడం దారుణమే. పార్టీ అన్నాక రెండు ప్రాంతాల గురించి చర్చించాలి. పార్టీ సమస్యలు గుర్తించాలి. క్యాడర్ కి దిశానిర్దేశం చేయాలి. తెలంగాణాలో అయితే రెండు దశాబ్దాలుగా అధికారం రుచి లేక పార్టీ అల్లాడిపోతోంది. దాన్ని గురించి చంద్రబాబు ఎక్కడా మాట్లాడకుండా కేవలం జగన్ ని ఆడిపోసుకోవడంతో మహానాడుని మమ అనిపించేశారు. తాను ఒక వైపే చూస్తామని చెప్పేసుకున్నారు.కరోనా వేళ కూడా పార్టీలో నాయకులను టెక్నాలజీ సాయంతో సమావేశపరచి చైతన్యం చేయడం మంచి విషయమే. పైగా పార్టీకి ఇది మంచి అవకాశం. ఏడాది క్రితం దారుణమైన పరాజయం ఎదురైంది. పార్టీ పడకేసింది. గత ఏడాదిగా క్యాడర్ లో ఉత్సాహం తగ్గింది. ఇక నాయకులు సైతం ఎక్కడివారు అక్కడ సర్దుకున్నారు. ఈ నేపధ్యంలో ఓడిన తరువాత టీడీపీ ఎక్కడ ఉంది. ఏం చేస్తే బతికి బట్టకడుతుంది అన్నది నలభయ్యేళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు చేయవ‌లసిన విశ్లేషణ. తర తమ భేదం లేకుండా అంతా కలసి తమ లోపాలను సమీక్షించుకోవాల్సిన సందర్భం. కానీ అదెక్కడా జరగడంలేదన్నది సగటు కార్యకర్త ఆవేదన‌గా ఉంది.వైసీపీ నేతలు సరదాకు సెటైర్లు వేస్తూంటారు. చంద్రబాబుకు, ఆయన పార్టీ నాయకులకు జగన్ పగలూ రాత్రీ కనిపిస్తారని, అలాగే ఉన్నట్లుంది ఇపుడు టీడీపీలో సీన్. చంద్రబాబు మొదలుకుని నాయకులంతా జగన్ ని విమర్శించడంలోనే పోటీ పడుతున్నారు. జగన్ ని ఎన్ని రకాలుగా కొత్త పేర్ల‌తో తిడితే అంత ఇమేజ్ తమకు వస్తుందనుకుంటున్నారో ఏమో కానీ చంద్రబాబు ముందు ఇదే వినిపిస్తున్నారు. నిజానికి మాజీ మంత్రులంతా అసలు పార్టీ వైపు చూడడం లేదు. పదవులు అనుభవించిన వారు ఇపుడు పక్క చూపులు చూస్తున్నారు. అటువంటి వారికి చంద్రబాబు హెచ్చరికలు పంపాలి. పనిచేసే వారిని దగ్గరకు తీయాలి. నిజానికి టీడీపీ ఓటమికి చంద్రబాబుతో సహా అంతా కారకులు, దాన్ని కనీసం ఈ సమయంలోనైనా మనసు విప్పి చర్చించుకున్నారా అంటే లేదనే వినిపిస్తోంది. ఎదుటి వారిని తిడితే పార్టీ పెరుగుతుదని చంద్రబాబు లాంటి సీనియర్ అనుకోవడమే తెలుగుదేశానికి అతి పెద్ద మైనస్ అనకతప్పదేమో.

Related Posts