YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చంద్రబాబు బాటలో జగన్

 చంద్రబాబు బాటలో జగన్

 చంద్రబాబు బాటలో జగన్
విజయవాడ, మే 29,
జగన్ కూడా అచ్చంగా చంద్రబాబు బాటలోనే వెళ్తున్నారు. ఆయన సైతం కేంద్రం వద్ద కనీసమాత్రంగా కూడా రాష్ట్ర ప్రతిపాదనలు పెట్టకుండా మౌనంగా ఉంటున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. బాబు విషయం వేరు. ఆయన కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నారు. . రెండు పార్టీలు కలసి 2014 ఎన్నికల్లో పోటీ చేశాయి. కాబట్టి కొంత మొహమాటం ఉండవచ్చు. జగన్ ది అలా కాదు కదా, పైగా ఏపీలో చూసుకుంటే బీజేపీ, వైసీపీల మధ్య ఉప్పూ నిప్పులా సీన్ ఉంది. అన్నీఅభివ్రుధ్ధి పనులు చేయండి, ఖజానా ఖాళీ గురించి మాత్రం మాట్లాడకండి అంటూ కమలనాధులు చిత్రమైన రాజకీయం ఆడుతున్నారు. ఈ దశలో జగన్ చేయాల్సిన పని కేంద్రం వద్ద పంచాయతీ పెట్టడమే.నిజానికి పాలకులు అయిదేళ్ళపాటు అధికారంలో ఉంటారు. ఆ తరువాత ప్రజలు తీర్పు ఇస్తే మళ్ళీ కొనసాగుతారు. కానీ వ్యవస్థ, ప్రజలూ ఇక్కడ శాశ్వతం, అందువల్ల ప్రభుత ఆస్తులు అంటే ప్రజలకు సంబంధించినవి . వాటిని కాపాడాలి, భావి ప్రయోజనాలకు వీలుగా వాడుకోవాలి. అంతే తప్ప తెగనమ్మడం వల్ల ఆ పూట పప్పు అన్నం తినొచ్చేమో కానీ దీర్ఘకాలంలో ఇబ్బందులు వస్తాయి. ఇది అందరూ చెప్పేదే. కానీ ఏపీలో మాత్రం బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ భూములు తెగనమ్మడానికి జగన్ సర్కార్ సిధ్ధపడుతోంది. అలాగే ఇపుడు టీటీడీ భూములు కూడా అమ్మకానికి పెట్టారు.విభజన వల్ల రెవిన్యూ లోటుతో చితికిపోయిన రాష్ట్రం ఏపీ. దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రానికి ఉంది. కానీ కేంద్ర పెద్దలు చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా కూడా ఒకేలా వ్యవహరిస్తున్నారు. సరే కేంద్రం అలా గట్టిగా ఉన్నా కూడా హక్కులను సాధించుకోవాలి. నిగ్గదీసి రావాల్సింది తెచ్చుకోవాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రిగా జగన్ గట్టిగానే నిలబడాలి. కేంద్రాన్ని నిలదీసేందుకు రెడీగా ఉండాలి. కానీ జగన్ కూడా బాబు మాదిరిగా అప్పులు చేస్తానూ, ఆస్తులు అమ్ముతానూ అంటున్నారు తప్ప మోడీ దగ్గర పెదవి విప్పలేకపోతున్నారు అంటున్నారు. ఇక ఏపీ బీజేపీ నేతలు కూడా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను సాధించే విషయంలో పూర్తిగా చేతులెత్తేసి ఏపీ సర్కార్ మీద ఉత్త విమర్శలకే పరిమితం అవుతున్నారు.ఏపీలో ఆస్తులు అమ్మకూడదు, అప్పులు చేయకూడదు, రాజధానులు మార్చి అయినా అభివృధ్ధి చేయరాదు, అన్నింటా రాజకీయమే. అన్నీ ప్రతిబంధకాలే. ఏపీలో పరిస్థితి ఎలా ఉంది అంటే శవాల మీద పేలాలు ఏరుకునేందుకు విపక్షలు సిధ్ధంగా ఉన్నాయని చెప్పాలి. ఏపీ మన సొంత రాష్ట్రం, కేంద్రాన్ని అంతా కలసి నిలదీసి సాధించుకుందామన్న ధ్యాస ఎవరికీ లేదు. అందుకే ప్రత్యేక హోదా వెనక్కి పోయింది. ప్రత్యేక ప్యాకేజీలు ఎక్కడ ఉనాయో అసలు అర్ధం కాదు, జగన్, బాబు, పవన్ ఇలా అంతా కూడా మోడీని ఏమీ అనలేకపోతున్నారు. ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్రాన్ని నిలదీయాల్సింది జగనే. అంతే తప్ప వేరే మార్గాలు చూసుకుంటామని ఊరుకుంటే కేంద్రానికి పోయేదేముంది. జగన్ మోడీని ఎదిరిస్తేనే మొనగాడు అవుతాడు అన్నది గుర్తు పెట్టుకోవాలి. నిగ్గదీసి నిధులు తెచ్చుకోవాలి. అంతే తప్ప భూములు అమ్మకాలు, అప్పులు చేయడాల వల్ల ఏపీ ఎప్పటికీ ఎత్తిగిల్లదు.

Related Posts