YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాబును ఒడ్డున పడేస్తున్న కోర్టులు

బాబును ఒడ్డున పడేస్తున్న కోర్టులు

బాబును ఒడ్డున పడేస్తున్న కోర్టులు
విజయవాడ, మే 29,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒకరకంగా క్యాడర్ లోనూ, నేతల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు హైకోర్టు తీర్పులు పార్టీని ఒడ్డున పడేసే విధంగా కన్పిస్తున్నాయి. ఇక టీడీపీ నేతలు భయపడాల్సిన పనిలేదని, వైసీపీ ప్రభుత్వం అరాచకాలను కోర్టు ద్వారా అడ్డుకోవచ్చని చంద్రబాబు పార్టీ క్యాడర్ కు సంకేతాలు పంపుతున్నారు. చంద్రబాబులో ఇప్పుడు మునుపెన్నడూ లేని ఉత్సాహం కన్పిస్తుంది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నది టీడీపీ నేతల ఆరోపణ. ఇసుక దగ్గర నుంచి మద్యం వరకూ అన్ని కేసులూ టీడీపీ నేతలపైనే పెడుతున్నారని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు. రాజధాని భూముల వ్యవహారం నుంచి ఈఎస్ఐ లో జరిగిన కుంభకోణం వరకూ టీడీపీ నేతలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక గ్రామస్థాయిలోనూ చిన్నా చితకా కేసులను టీడీపీ నేతలపై పెడుతున్నారని చంద్రబాబు విమర్శలు చేస్తూ వస్తున్నారు.అక్రమ కేసుల కారణంగానే టీడీపీ క్యాడర్, నేతలు పార్టీ కార్యక్రమాల్లో ఏడాది నుంచి పాల్గొనడం లేదు. పార్టీ జెండా పట్టుకోవడానికే భయపడిపోతున్నారు. కొందరు నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు అక్రమ కేసులకు భయపడి ఇప్పటికే వైసీపీ మద్దతుదారులుగా మారిపోయారు. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి క్యాడర్ ను బయటపడేందుకు ఎన్ని సమీక్షలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సీనియర్ నేత కోడెల శివప్రసాద్ లాంటి నేతలే ఆత్మహత్యకు పాల్పడటంతో ఒకదశలో చంద్రబాబు సయితం డీలా పడ్డారు.కానీ హైకోర్టు తీర్పులతో చంద్రబాబులో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తే కోర్టును ఆశ్రయించాలని నేతలకు, క్యాడర్ కు చెబుతున్నారు. పార్టీ న్యాయ విభాగాన్ని కూడా ఆయన అలెర్ట్ చేశారు. పార్టీ క్యాడర్ కు అవసరమైన న్యాయసాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఇటీవల వరసగా హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడంతో దానిని ముందు పెట్టి చంద్రబాబు క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు ఏడాది తర్వాత పరిస్థితి అనుకూలంగా మారుతున్నట్లు కన్పిస్తుంది
 

Related Posts