YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సుదర్శనయాగంలో పాల్గొన్న కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి

సుదర్శనయాగంలో పాల్గొన్న కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి

సుదర్శనయాగంలో పాల్గొన్న కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి
గజ్వేల్ మే 29,
కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. . గోదావరి జలాలను అరకిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న కల సాకారమయ్యే కల నిజమయింది. కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మర్కూక్‌ పంప్‌హౌస్‌ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు.  త్రిదండి చినజీయర్‌ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను ప్రారంభించారు. స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి చేరుకున్నాయి. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు. కొండపోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఐదు జిల్లాల చిరకాల స్వప్నం సాకారం అయ్యింది. సముద్ర మట్టానికి 530 మీ. ఎత్తులో కొండపోచమ్మ రిజర్వాయర్‌ చేపట్టారు. రెండు పంప్‌హౌజ్‌లున్న ఏకైక రిజర్వాయర్‌ కొండపోచమ్మ రికార్డ్ సృష్టించనుంది. కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలు. కొండపోచమ్మతో 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే హైదరాబాద్‌కు కూడా తాగునీరు అందనుంది. కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts