ఈవై ఇండియా ట్యాక్స్ కన్సల్టెంట్ సర్వే
ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను స్లాబ్‌లు, రేట్లను తగ్గించనుందని, డివిడెండ్లపై ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను రేట్లను యథావిధిగా కొనసాగించే అవకాశాలున్నాయని ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ ఈవై ఇండియా సంస్థ చేసిన ముందస్తు బడ్జెట్ సర్వేలో వెల్లడించింది. అంతేకాకుండా ఉద్యోగులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు వీలుగా ఇప్పటివరకు విధిస్తూ వస్తున్న రకరకాల పన్నుల స్థానంలో ఒక స్టాండర్డ్ డిడక్షన్ పన్ను విధానాన్ని అవలంబిస్తే బాగుంటుందని 59 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నట్లు సంస్థ నివేదికలో పేర్కొంది. జనవరిలో నిర్వహించిన ఈ సర్వేలో కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే కాకుండా వివిధ సంస్థలకు చెందిన సీఎఫ్‌వోలు, సీనియర్ ఆర్థికవేత్తలు అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించింది