YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
పత్తికొండ మే 29
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి క్రాంతి నాయుడు అన్నారు.ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలు అమలు చేస్తాం అని కేంద్రంలో బీజేపీ మోసం చేసింది,హోదా సాధిస్తాం అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మాట తప్పి,మడమ తిప్పి చేతులు ఎత్తేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని అన్నారు. 25 ఎంపీలతో కేంద్రం మెడలు వంచుతాం అని, ఇప్పుడు 22 ఎంపీలతో కనీసం ఆ వంచే ప్రయత్నం అన్న చేయకపోగా వారికి దాసోహం అయిన పరిస్తితి నెలకొంది.లోక్ సభలో,రాజ్య సభలో సముచిత స్థానం ఉన్నా,ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ హోదా విషయం కానీ, విభజన హామీలు అములు కోసం కానీ పూర్తి స్థాయి ప్రయత్నం చేయకపోవడం మన రాష్ట్ర దురదృష్టం అని అన్నారు.రాష్ట్రం ఈరోజు దివాళా తీసినట్లుగా ఉంది అని హై కోర్టు సైతం అనడం విచారకరం,అప్పుడు టీడీపీ ప్రభుత్వం లో జరిగిందే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో జరుగుతుంది తప్ప రాష్ట్ర అభివృద్ది కానీ సాధికారత కానీ ఒక్క శాతం కూడా పెరగడం లేదు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండేది అని, విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు. రాష్ట్రం లో 151 సీట్లు ఉన్నా రాష్ట్ర అభివృద్ది జరగకపోవడం చూస్తే ప్రస్తుత ప్రభుత్వ చేతకాని తనం కనిపిస్తోందని, పోయిన ప్రభుత్వం లో కనీసం కొన్ని అయినా అమలు జరిగాయి, ఇప్పుడు అవి కూడా జరగక రాష్ట్రం దివాళా తీసి భూములు అమ్ముకునే పరిస్తితి,రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకపోవడం వళ్ళే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.ఈరోజు నిమ్మగడ్డ రమేష్ గారి జడ్జిమెంట్ మరియు పూర్వ జడ్జిమెంట్ ల నుండి అయినా ప్రభుత్వ వైఖరి మారాలి,సుగాలి ప్రీతి కేసు సి.బి.ఐ  కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషించదగ్గ విషయం,కానీ మరి రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం,దిశ వ్యవస్థ వల్ల అనుకున్న ఫలితాలు రావట్లేదు అన్నట్టేన అని ప్రజలు అనుంటున్నరు అని అన్నారు.మొన్న హై కోర్ట్ చీఫ్ జస్టిస్ మహేశ్వరి, డాక్టర్ సుధాకర్ గారి కేసు సీబీఐ కి అప్పగిస్తూ ఏపీ పోలీస్ పైన మాకు భరోసా లేదు అనడం కూడా చాలా విచారకరం వీటన్నిటిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుత ప్రభుత్వం  ఐఏఎస్ లను, ఐపీఎస్ లను అధికారులను సైతం ఎలా ఇబ్బంది పెడుతుంది అనేది, ఇప్పటికైనా ప్రభత్వం ప్రతిపక్షాల సూచనలను పాజిటివ్ గా తీసుకొని, అధికారులకు స్వేచ్ఛ ను ఇచ్చి, ప్రజల ప్రభుత్వంగా ముందుకు వెళ్తే 5 యేళ్లు పూర్తిగా ఉంటుందని,లేకపోతే అది కూడా కష్టమే అని అన్నారు.నియోజకవర్గంలో యువత పార్టీ లో చేరుటకు సిద్దం అవుతున్నారని, లాక్ డౌన్ పూర్తి అయ్యాక సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. గ్రామ స్థాయి పోగ్రామ్స్ ప్లాన్ చేయడం జరిగిందని,నియోజకవర్గ స్థాయి లో జరిగిన మండల స్థాయి నాయకుల కాన్ఫరెన్స్ లో ప్రస్తావించడం జరిగిందని ఆయన తెలియజేసారు.
 

Related Posts