ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు
న్యూ ఢిల్లీ మే 29
ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865. కోవిడ్-19 కారణంగా ఇప్పటివరు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 61 వేల 998 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి 25 లక్షల 79 వేల 534 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురైతుంది. కోవిడ్-19తో యూఎస్‌ఏ లో ఇప్పటి వరకు 1,03,330 మంది చనిపోయారు. కోవిడ్-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన వివిధ దేశాల వివరాలిలా ఉన్నాయి. బ్రెజిల్-26,764, రష్యా-4,142, స్పెయిన్-27,119, యూకే-37,837, ఇటలీ-33,142, ఫ్రాన్స్-28,662, జర్మనీ-8,570, టర్కీ-4,461, ఇరాన్-7,627, పెరూ-4,099, కెనడా-6,877, చైనా-4,634, మెక్సికో-9,044, పాకిస్థాన్-1,260, బెల్జియం-9,388, నెదర్లాండ్స్-5,903, ఈక్వెడార్-3,313, స్వీడన్-4,266, పోర్చుగల్-1,369, స్విర్జర్లాండ్-1,919, ఐర్లాండ్-1,639, ఇండోనేషియా-1,496, పోలాండ్-1,038, రోమేనియాలో 1,235 మంది చనిపోయారు.