YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

త్వరలో శుభవార్త

త్వరలో శుభవార్త

త్వరలో శుభవార్త
సిద్దిపేట మే 29 
తెలంగాణ ప్రజలకు త్వరలోనే తీపి కబురు చెబుతానని.. అది దేశం ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే రైతులకు ఎక్కడా ఇటువంటి శుభవార్త చెప్పి ఉండరని అయన అన్నారు. శుక్రవారం నాడు కొండపోచమ్మ జలాశయం వద్ద మర్కూక్ పంప్హౌస్ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తులో ఇదొక ఉజ్వలమైన ఘట్టంగా కేసీఆర్ అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఓ ఉజ్వల ఘట్టం అని పేర్కొన్నారు. వందల మీటర్ల ఎత్తుకు నీటిని పంపించడం జోక్ కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు రూ. లక్ష కోట్ల విలువైన పంటలు పండిస్తున్నారని.. పసిడి పంటల సాగు దిశగా రాష్ట్రం పయనిస్తోందన్నారు. ‘‘యావత్ ప్రపంచం అబ్బురపడే ప్రాజెక్టు కాళేశ్వరం. కొండపొచమ్మసాగర్ జలాశయం కాళేశ్వరంలో పదో లిఫ్ట్ ప్రాజెక్టు. మల్లన్న సాగర్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు. తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమే ఈ ప్రాజెక్టులు. తెలంగాణ వారికి పనిచేతకాదని విమర్శలు చేసేవారికి తమ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తిరుగులేని సమాధానం ఇచ్చారని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర రాష్ట్రాల కూలీల సేవలు వెలకట్టలేనివి. 165 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను నిర్మాణం చేశాం. భూసేకరణలో రెవెన్యూ శాఖ అద్భుతంగా పనిచేసిందని కేసీఆర్ తెలిపారు.

Related Posts