ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: స్పష్టం చేసిన చైనా
న్యూ ఢిల్లీ మే 29
భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చైనా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 27న ప్రకటించిన నేపథ్యంలో చైనా విదేశాఖ ప్రతినిధి లిజియాన్ పై విధంగా స్పందించారు. భారత్, చైనా సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లఢక్ సహా వాస్వవాదీన రేఖ వెంబడి రెండు దేశాలు తమ బలగాలను భారీ ఎత్తున మోహరిస్తున్నాయి. 2017లో తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత మళ్లీ ఇరు దేశాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించడం ఇదే తొలిసారి. ఇప్పటికే చైనా అక్కడ చైనా సుమారు 2500 మంది బలగాలను తరలించిందని ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను కూడా చేపడుతున్నదని తెలిపారు.