YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ముఖ్యమంత్రికి చెంపపెట్టు - మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు

 ముఖ్యమంత్రికి చెంపపెట్టు - మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు

 ముఖ్యమంత్రికి చెంపపెట్టు
- మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు
శ్రీకాకుళం మే 29
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి అర్ధాంతరంగా తొలగించడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ముఖ్యమంత్రికి రెండు చెంపల చెల్లు మనేలా ఉంది అని శాసన సభా ప్రతి పక్ష పార్టీ ఉప నేత కింజరాపు అచ్చంన్నాయుడు అన్నారు. కరోనా ప్రబలకుండా ఉండేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే అదేదో తెలుగుదేశం పార్టీ చేయించినది అని అతడిని అర్దాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ హై కోర్టును ఆశ్రయించిన రమేష్ కుమార్ తక్షణమే కమిషనర్ గా నియమించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వటం ఎంతో సంతోషం కలిగించింది అన్నారు. ఇలా వరుసగా న్యాయ స్తానం లో చెంప దెబ్బలు తగులుతున్న ముఖ్య మంత్రి కి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం సిగ్గు చేటు అన్నారు. అతడి స్తానం లో తానే గనుక ఉంటే వంద అడుగులు లోతు అయినా నీరు లేని బావి లో దూకి ఆత్మహత్య చేసుకునేవాడిని అన్నారు. యే మాత్రం న్యాయ స్తానం పై నమ్మకం గౌరవం ఉన్న ముఖ్యమంత్రి తక్షణమే ఆ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది అనటానికి ఈ తీర్పు ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారు.

Related Posts