YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
భూదాన్ పోచంపల్లి మే 29
ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే దాన్యం కొనుగోలు చేస్తానన్న మాట వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున సిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ దశరధ నాయక్ కు  వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ మండల పరిధిలోని మొత్తం 30 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని ఇప్పటి వరకు 12 కేంద్రాలు నడుస్తున్నాయని  అయితే 18 కేంద్రాల్లో అయిపోయిందని ఇంకా 12 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా సుమారుగా ఇంకా ఒక లక్ష బస్తాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల లో ఉందని అన్నారు ధాన్యం ఇంకా కొనుగోలు చేయాల్సి ఉండగానే ప్రభుత్వం ఈ నెల 31  వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడం ఇబ్బందులకు గురి చేయడం అవుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం 31 వరకు మాత్రమే కొనుగోలు చేస్తామన్న మాట ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పగిల్లా లింగారెడ్డి మండల కమిటీ సభ్యులు కోటా రామచంద్రారెడ్డి నోముల కృష్ణారెడ్డి  మంచాల మధు ఎర్ర బోల వెంకటేష్ దుబ్బాక జగన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts