YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 వర్తక, వాణిజ్య కార్యకలాపాలపై మల్లగుల్లాలు

 వర్తక, వాణిజ్య కార్యకలాపాలపై మల్లగుల్లాలు

 వర్తక, వాణిజ్య కార్యకలాపాలపై మల్లగుల్లాలు
గుంటూరు, మే 30,
గుంటూరు జిల్లాలో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా మొత్తం రెడ్‌జోన్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. తాజాగా జోన్ల నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కేవలం ఐదారు మండలాలు మాత్రమే రెడ్‌జోన్‌లో ఉన్నాయి. గుంటూరు, నర్సరావుపేట, తాడేపల్లి, తెనాలి, మాచర్ల, మినహా మిగతా మండలాలన్నీ గ్రీన్‌జోన్‌లోనే ఉంటాయని తాజా ప్రతిపాదన. ఇప్పటికే గ్రీన్‌జోన్‌ పరిధిలోని కొన్ని మండలాల్లో మద్యం దుకాణాలకు అనుమతిచ్చి ఇతర వ్యాపార సంస్థలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెడ్‌జోన్‌ పరిధి తగ్గించాలంటూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై జిల్లా అధికారుల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ నెల 17 తరువాత లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించి అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆయా ప్రాంతాల్లో కరోనా మళ్లీ కేసులు వస్తే ఏం చేయాలి? అనే అంశాలు అధికారులకు అంతుబట్టడం లేదు.జిల్లాలో 52 రోజుల్లో 404 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 8 మంది మృతిచెందారు. 257 మంది వరకూ డిశ్చార్జి అయ్యారు. 52 రోజుల్లో జిల్లాలోని ఎక్కువ ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. అయితే శని, ఆదివారాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడిగింపు, మార్పులపై ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఆదివారం జోన్ల మార్పిడికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారని తెలిసింది. 28 రోజుల పాటు ఒక్క కేసు కూడా నమోదు కాకుంటే ఈ ప్రాంతాని గ్రీన్‌ జోన్‌గా గుర్తించవచ్చునని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాలో 58 మండలాలకు గాను 43 మండలాలను గ్రీన్‌ జోన్‌ మండలాలుగా ప్రకటించింది. తాజాగా తెనాలి, తాడేపల్లి మండలాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. అచ్చంపేట, క్రోసూరు, కారంపూడి, మేడికొండూరు, కర్లపాలెం తదితర ప్రాంతాల్లో 35 రోజుల కిందట కేసులు నమోదు కాగా ఆ తరువాత మళ్లీ కేసులు రాలేదు. కానీ ఇప్పటికీ ఈ మండలాలన్నీ రెడ్‌జోన్‌లోనే కొనసాగుతున్నాయి. తాడికొండ మండలంలో ఒక్క కేసు నమోదు కాకున్నా ఈ మండలం రెడ్‌జోన్‌లో ఉంచారు. దాచేపల్లిలో గత నెలలో ఎక్కువ కేసులు రావడం వల్ల పిడుగురాళ్ల, గురజాల మండలాలను కూడా రెడ్‌జోన్‌గానే పరిగణించారు. ఇలా ఒక మండలంలో కేసులు వస్తే సమీప మండలాలను కూడా రెడ్‌జోన్‌లుగా జిల్లా అధికారులు పరిగణిస్తున్నారు. కానీ తాడేపల్లి మండలంలో ఎక్కువ కేసులు వచ్చినా ఇక్కడ సీఎం నివసిస్తున్నందున ఇక్కడ అధికారికంగా రెడ్‌జోన్‌గా ప్రకటించలేదు.తాజాగా రెడ్‌జోన్‌గా భావించే ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌గా పరిగణించాలని, ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా గుర్తించాలని నిర్ణయించారు. గుంటూరు, నర్సరావుపేట, తాడేపల్లి, దాచేపల్లిలో ఎక్కువ కేసులు నమోదైన దృష్ట్యా 3 కిలో మీటర్ల మేరకు బఫర్‌ జోన్‌గా పరిగణించారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జోన్ల పరిధి కుదించడం ద్వారా సాధారణ కార్యకలాపాలకు, వ్యాపారాలకు, రవాణాకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈమేరకు జిల్లా అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం జోన్ల మార్పిడిపై అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బఫర్‌జోన్‌ పరిధిని 3 కిలో మీటర్ల నుంచి కిలో మీటరుకు తగ్గించాలని, కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిని కిలో మీటరు నుంచి 80 మీటర్లకు కుదించాలని యోచిస్తున్నారు. దీనివల్ల గుంటూరులో టూ టౌన్‌లో వ్యాపార కార్యకలాపాలకు అనుమతి వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో 28 రోజుల పాటు ఎటువంటి కేసులు నమోదు కానీ ప్రాంతాలను గ్రీన్‌ జోన్లగా మార్చడం, ఒకటి రెండు కేసులు నమోదు అయిన ప్రాంతాలను ఆరంజ్‌జోన్‌గా మార్చడం తదితర అంశాలపై నివేదికల రూపకల్పనలో అధికారులు తలమునకలై ఉన్నారు. సోమవారం నుంచి రెడ్‌జోన్‌లు మినహాయించి మిగతా ప్రాంతాల్లో సాధారణ వ్యాపార కార్యకలపాలాపాలకు అనుమతిస్తారని తెలుస్తోంది.కరోనా కొత్త కేసులేమీ నమోదు కాలేదు. 404 మందికి కరోనా వైరస్‌ నిర్థారణైంది. నర్సరావుపేట, గుంటూరు, తెనాలి, తాడేపల్లి ప్రాంతాల్లో కేసులు నమోదు కాకపోవడంపై అధికారులు ఊపరిపీల్చుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆశాజనక పరిణామం.

Related Posts