YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

 భారత్ కు మద్దతుగా మాల్దీవులు

 భారత్ కు మద్దతుగా మాల్దీవులు

 భారత్ కు మద్దతుగా మాల్దీవులు
న్యూఢిల్లీ, మే 30,
భారత్‌ను టార్గెట్ చేస్తూ ఐక్యరాజ్యసమితిలో ఓఐసీ గ్రూప్‌ను ఏర్పాటుచేయడానికి దాయాది చేసిన ప్రయత్నాలు ఆదిలోనే బెడిసికొట్టాయి. ఓఐసీ సభ్యదేశాలే పాక్‌కు షాక్ ఇచ్చాయి. ఇస్లామోఫోబియాపై ఐక్యరాజ్యసమితిలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) రాయబారుల అనధికారిక సమూహాన్ని రూపొందించడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ అడ్డుకున్నాయని పాక్ పత్రిక డాన్ ఓ కథనం ప్రచురించింది. కాగా, భారత్‌ విషయంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తీసుకునే ఏ చర్యలకు తాము మద్దతు ఇవ్వబోమని హిందూ మహాసముద్రంలో ఇండియాకు వ్యూహాత్మక భాగస్వామిమాల్దీవులు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసింది.తాజాగా, ఈ జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) చేరింది. ఇస్లామోఫోబియాతో భారతదేశాన్ని ఒంటరిని చేయడానికి వాస్తవంగా తప్పు కాదు, కానీ ఇది దక్షిణ ఆసియాలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని మాల్దీవులు వ్యాఖ్యానించింది. విదేశాంగ మంత్రులు మాత్రమే అలాంటి బృందాన్ని ఏర్పాటు చేయగలరని పాకిస్తాన్ చర్యలకు తాము మద్దతు ఇవ్వబోమని యూఏఈ స్పష్టం చేసింది. భారత్‌పై ఓఐసీ చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలో.. మాల్దీవులు, యూఏఈ ప్రకటనల వల్ల ఊరట లభించింది. తనను తాను ముస్లిం ప్రపంచానికి సమిష్టి గొంతుకుగా అభివర్ణించుకునే ఓఐసీ.. జమ్మూ కశ్మీర్ పరిణామాలపై మాత్రమే కాదు, భారత్‌లో ముస్లింలు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తోంది.అమెరికాలోని మాల్దీవుల శాశ్వత ప్రతినిధి తిల్మీజా హుస్సేన్ మాట్లాడుతూ.. ఇస్లామోఫోబియా, జెనోఫోబియా లేదా రాజకీయ మరే ఇతర ఎజెండాతో హింసను ప్రోత్సహించే విధానాలకు తాము వ్యతిరేకమని, అలాగే, ఒక నిర్దిష్ట దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం నిజమైన సమస్యను తప్పుదారి పట్టించడం లాంటిదని తాము నమ్ముతామని ఆమె వ్యాఖ్యానించారు.విభిన్న సంస్కృతులు, బహుళ సమాజాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాసామ్య దేశంగా ఉన్న భారత్‌లో 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు.. ఇస్లామోఫోబియాతో తప్పుడు ఆరోపణలు చేయడం.. దక్షిణాసియాలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. అనేక శతాబ్దాలుగా భారత్‌లో ఇస్లాం ఉందని, ఆ దేశంలో రెండో అతిపెద్ద మతం ఇదేనని, జనాభాలో 14.2 శాతం మంది ముస్లింలు ఉన్నారని అన్నారు

Related Posts