ప్రేమికుల ఆత్మహత్యయత్నం
సూర్యాపేట మే 30
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ జంట శివారు పంటపొలాల్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. పొదిల వీరబాబు(35) అక్కడికక్కడే మృతి చెందగా చింత్రియాల మాధవి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరబాబు కు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అదేవిధంగా మాధవికి వేరే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా సంవత్సరం క్రితం వీరబాబు, మాధవి గ్రామం నుండి వెళ్ళిపోయి సహజీవనం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది క్రితం గ్రామం నుండి వెళ్ళిన ఈ జంట నేడు గ్రామానికి తిరిగి వచ్చి పంటపొలాల్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్య పాల్పడటం కలకలం సూచిస్తుంది. కులాంతర వివాహం, గతంలో జరిగిన మొదటి పెళ్లి కాదని రెండో పెళ్లి చేసుకోవడం పట్ల కుటుంబీకులు ఒప్పుకోరు అన్న ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.