YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు చెక్కులకు అంతా సిద్ధం

రైతు బంధు చెక్కులకు అంతా సిద్ధం

అన్నదాతలకు భరోసానిచ్చే ‘రైతు బంధు’ చెక్కులు వచ్చేస్తున్నా యి. రాష్ట్ర ప్రభుత్వ లోగోతో ముద్రితమవుతున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ ముద్రించిన మూడు ‘రైతు బంధు’ చెక్కులు సిద్ధమౌతున్నాయి. వాటర్‌మార్క్ తరహాలో తెలంగాణ రాజముద్రను పెద్ద సైజులో ముద్రించింది. మూడు నెలల పాటు చెల్లుబాటయ్యే ఈ చెక్కులపై లబ్ధిదారుల పేరు, పాసుపుస్తకం యూనిక్ ఐడి నెంబరు, రైతు, గ్రామం, మండలం, జిల్లా పేరు ఉన్నాయి.ఈ పథకం ద్వారా 2018-19 ఖరీఫ్ నుంచి చెక్కుల ద్వారా ఎకరానికి 2 పంటలకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రైతు బంధు పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు కానుంది. రైతుబంధు పథకం కోసం వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకింగ్, స్టేట్ సమాచార శాఖ అధికారుల అధ్యక్షతన రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు. 8 బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చే చెక్కులను ముద్రించనున్నారు.రూ. 50 వేల లోపు వారికి సింగిల్ చెక్కు ఇవ్వనున్నారు. రూ. 50 వేలు దాటితే రెండు చెక్కులు జారీ చేస్తారు. పట్టాదారులకే నేరుగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. చెక్కుల పంపిణీ వివరాలు ప్రతి రోజు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. చెక్కులపై పట్టాదారు పేరు, ఆధార్ నెంబర్, వయస్సు, పాస్‌బుక్ నెంబర్, రెవెన్యూ విలేజ్, మండలం, జిల్లా, సాయం మొత్తం, కమిషనర్, డైరెక్టర్ స్పెసిమన్ సంతకం, మొబైల్ నెంబర్ వివరాలు ఉండనున్నాయి. చెక్కులపై రైతు బంధు పథకం పేరును కూడా ముద్రిస్తారు. చెక్కు చెల్లుబాటు కాలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత కొత్త చెక్కు తీసుకోవాల్సి ఉంటుంది. చెక్కుల పంపిణీని డీఏఓలు, జిల్లా ఉద్యానవన అధికారులు, సహకార శాఖ, ఆర్డీవోలు, ఏడీయేలు పర్యవేక్షిస్తారు.ఒక చెక్కుపై ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ రూరల్ మండలం, అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు తు తుకారం పేరు ఉంది. ఈ రైతుకు రూ. 1300 వ్యవసాయ పెట్టుబడి కింద రానుంది. అంటే 13 గుంటల భూమి ఉన్నట్లు లెక్క. అలాగే ఆదిలాబాద్ రూరల్ మండం, అనుకుంట గ్రామానికి చెందిన బాస బక్కన్నకు పెట్టుబడి సొమ్ము రూ.6480 రానుంది. ఎకరాకు రూ. 4 వేల చొప్పున 1.2480 ఎకరాలకు ఇస్తున్నారు. ఎస్‌బిఐ బ్యాంకు ముంబాయిలో చెక్కులను ముద్రిస్తున్నట్లు తెలిసింది. చెక్కులు గులాబీ రంగులో ముద్రిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న పెట్టుబడి సొమ్ము ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారో రైతులే లెక్క చూసుకోవాల్సి ఉంటుంది. చెక్కులపై ఎన్ని ఎకరాలకు ఆర్థిక సాయం ఇస్తున్న వివరాలు లేకపోవడంతో అక్షరజ్ఞానం లేని రైతులు వారి భూమి వివరాలతో లెక్కించుకోవాల్సి ఉంటుంది. కొంత గందరగోళం తలెత్తే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రైతు బంధు చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ముద్రించే ఒక్కో చెక్కుకు రూ.135 ఖర్చు అవుతోంది. చెక్కు ముద్రణకు రూ.115 అవుతుండగా, జిఎస్‌టి కూడా ఇందులో కలుస్తుంది. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం ఒక్క గుంట భూమికి కూడా రూ.100 పెట్టుబడి అందుతుంది. రైతులలో దాదాపు లక్షన్నర మంది వరకు గుంట భూమి కలిగిన వాళ్లు ఉంటారని మొత్తం రైతులలో వీళ్లు 2 శాతమని అధికారులు చెబుతున్నారు

Related Posts