చంద్రబాబు కొలువుదీరిన కృష్ణా జిల్లాపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా విజయవాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి వైసీపీలోకి రాబోతున్నారు. యలమంచిలి వైసీపీలో చేరబోతున్నారన్న వార్త కృష్ణా టీడీపీలో అలజడి రేపుతోంది.కృష్ణా జిల్లా నుంచే పేరున్న టీడీపీ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు రెడీ అవ్వడంతో టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, కొందరు మంత్రులు వీరిని బుజ్జగించలేక అల్లాడి పోతున్నారు. విజయవాడకు చెందిన టీడీపీనేత యలమంచిలి రవి వైసీపీ లో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. జగన్ కృష్ణా జిల్లాలో యాత్ర ప్రారంభం అయిన వెంటనే ఆయన కండువా కప్పేసుకుందామనుకున్నారు. అయితే యలమంచలి రవిని టీడీపీ నేతలు బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. రవికి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా పార్టీలో ఉంటే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. అయితే రవి మాత్రం పార్టీని వీడేందుకే సిద్ధమయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 2009లో దేవినేని నెహ్రునే ఓడించి విజయవాడ ఈస్ట్ నుంచి పీఆర్పీ తరపున యలమంచిలి రవి గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు.విజయవాడ ఈస్ట్ సీటు ఆయనకే ఇస్తారని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం గద్దె రామ్మోహన్‌కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ యలమంచిలి రవి పార్టీ కోసం పనిచేశారు. అయితే ఇటీవల టీడీపీ కార్యక్రమాలకు ఆయనకు కనీసం ఆహ్వానం కూడా అందకుండా టీడీపీ నేతలు చేస్తున్నారు. విజయవాడలో టీడీపీ గట్టి మద్దతుదారులుగా ఉన్న ఒక సామాజికర్గం ఓట్లను రవి ప్రభావితం చేయగలరని భావిస్తున్నారు.రవిని వైసీపీలోకి తీసుకురావడంలో కొడాలి నాని, వంగవీటి రాధా కీలక పాత్ర పోషించారు. సుజనాచౌదరి కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా తన బంధువైన రవి పార్టీ మారకుండా నిరోధించకపోవడంపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఆయన వైసీపీలో చేరుతున్నారుబలమైన నేత వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీని వీడేందుకు రెడీ అయిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు తనయుడు కృష్ణ ప్రసాద్ గతంలో గుంటూరు పట్టణం నుంచి టీడీపీ తరుపున పోటీ చేయాలని భావించారు. టిక్కెట్ ఇస్తామని చెప్పి చివరినిమిషంలో టీడీపీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని తన అనుచరులతో సమావేశమయ్యారు. ఇది తెలుసుకున్న టీడీపీ మంత్రులు కృష్ణ ప్రసాద్ వద్దకు వెళ్లి బుజ్జగింపులు చేపట్టారు