YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఇది రైతు దగా

 ఇది రైతు దగా

 ఇది రైతు దగా
పాలకొల్లు
రాష్ట్రంలో నేడు వైసీపీ ప్రభుత్వం ప్రారంభించేది రైతు భరోసా కాదు, రైతు దగా అని ఎద్దేవా చేశారు పశ్చిమగోదావరి జిల్లా  పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నిమ్మల  ఆద్వర్యంలో పంట పొలాల్లో  నల్ల జెండాలతో నష్ట పోయిన పంటను దహనం చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేసారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  నాడు మానిఫెస్టోలో రైతులకు 50 వేలు ఇస్తామని,  నేడు 30వేలు మాత్రమే ఇవ్వడం మాట తప్పడం, మడమ తిప్పడం కాదా అన్నారు. అన్నదాత సుఖీభవ, రైతు ఋణ మాఫీ 5వ వాయిదాను రద్దు చేసిన జగన్ కు రైతు భరోసాపై మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. 80 లక్షల మంది రైతులకు రైతు భరోసా  అని చెప్పి నేడు 40లక్షల మంది రైతులకే  రైతు భరోసా ఇవ్వడం రైతు మోసం కాదా అన్నారు. 70 శాతం ఉన్న కౌలు రైతులలో కేవలం 1శాతం కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తూ కౌలు రైతులను జగన్ మోసం చేస్తున్నారు. బడ్జెట్ లో 16 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా అని చెప్పి నేడు 3లక్షల మంది కౌలురైతులకే రైతు భరోసా అందించడం పక్కా మోసం కాదా అన్నారు కులం పేరు చెప్పి కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వక పోవడం దారుణం అని అన్నారు. రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులు కాదు కావల్సింది రైతులకు ఉత్తమ సేవలు కావాలి అని,కేవలం రైతు భరోసా కేంద్రాలు వైకాపా  నాయకులు, కార్యకర్తలకు ఉపాధి పధకంగా మారి పోయిందని అన్నారు. రైతు భరోసాతో ప్రచార ఆర్భాటం తప్ప రైతులకు ఒరిగేందిమిలేదని వైసీపీ పార్టీ పై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు  తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Related Posts