YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సోషల్ మీడియాల్లో మైలేజ్ పోరు

సోషల్ మీడియాల్లో మైలేజ్ పోరు

సమైక్య ఆంధ్ర ఉద్యమంలో హోదా కోసం విభజన హామీల కోసం ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నా అందులో పాల్గొంటుంది ఆయా పార్టీల నాయకులు, క్యాడర్ తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదు. రాష్ట్ర విభజన సందర్భంలో అన్ని పార్టీలు ఏపీకి చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తు ఉంచుకున్నారు. అధికారంలోకి వచ్చకా ఒక పార్టీ మరో పార్టీ పై బ్లేమ్ గేమ్ ఆడుతూ రాష్ట్ర ప్రయోజనాలు ఫణంగా పెట్టడాన్ని నిశీతంగా గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, మాట తప్పడం ఎన్నికలు ముందుకు వచ్చేటప్పటికి అన్ని పార్టీలు ఒకే రూట్ లో వెళుతున్నాయి.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటున్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేయించి ప్రజల్లో క్రెడిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నా…ఎవరికి వారే ఆ ఘనత మాదేనని చెప్పుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. హోదా అవసరమని ఒకసారి, అదేమైనా సంజీవినా అని మరోసారి, హోదా కంటే ప్యాకేజి మంచిదని ఇంకోసారి ఇలా రకరకాలుగా మాట్లాడారు చంద్రబాబు. అసలు హోదా సంగతి ప్రస్తావిస్తేనే ఊరుకునేవారు కాదు. ఇప్పుడు వాస్తవ పరిస్థితి తెలిసిందే. హోదా కోసం పోరాడుతుంది మేమే. వైకాపా నేతలు పార్లమెంటు బయటకు తిరుగుతున్నారనే ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. ఫలితంగా హోదా కోసం తాము అంత చేశాం. ఇంత చేశామని ప్రజల్లో చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.తొలి నుంచి హోదా కోసం పోరాడుతుంది వైసీపీ. అందులో సందేహం లేదు. కానీ మధ్యలో ఆ పార్టీకి చిత్తశుద్ది లోపించింది. కాడి కింద పడేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపింది. మాయ చేయడం, అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేయడం టెక్నాలజీ పెరిగాక ఇప్పుడు సాధ్యం కావడం లేదు. పార్టీ మీడియా సంస్థలు ఆయా పార్టీల ప్రచారాన్ని ఉధృతం చేసి చూపగలిగినప్పటికీ గతం,వర్తమానం పోలుస్తూ వీడియోలు నెట్ లో పోస్ట్ అవుతున్నాయి. వాట్స్ అప్ ఫేస్ బుక్ , ట్విట్టర్, వెబ్ సైట్ ల్లో ప్రవాహాల్లా పోస్ట్ అవుతూ పండితుడి నుంచి పామరుడి వరకు ఆలోచనలో పడేస్తున్నాయి. ఉదాహరణకు విభజనకు ముందు రాజ్యసభలో వెంకయ్య నాయుడు హోదా ఐదేళ్ళు కాదు, పదేళ్ళు అనడం, పదేళ్ళు సరిపోదు పదిహేనేళ్ళు అంటూ చంద్రబాబు చెప్పే వీడియోలు వైరల్ గా మారాయి. హోదా పై చంద్రబాబు తరువాత ప్యాకేజి ముద్దు హోదా అంటే జైలుకే అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన బిజెపితో కటీఫ్ చెప్పి హోదా పల్లవి అందుకున్నాక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక పవన్ కళ్యాణ్ సైతం వివిధ సందర్భాల్లో టిడిపి కి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనకు ఇబ్బందిగా మారాయి. ఆయన చర్యలు ఊహాతీతం అంటూ ఆన్ లైన్లో హాట్ హాట్ పోస్ట్ లు నాడు నేడు లు వస్తూనే ఉన్నాయి. ఇక బిజెపి 2014 ఎన్నికల ముందు ఏపీలో ప్రచార సభల్లోమోడీ పలికిన మాటలు, ఇప్పుడు చెబుతున్న మాటలు ఆ పార్టీకి శాపంగా మారాయి. సామాజిక మాధ్యమాల్లో అవి చక్కెర్లు కొడుతున్నాయి.

Related Posts