YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 కరోనా డెడ్ బాడీతో కేసులు

 కరోనా డెడ్ బాడీతో కేసులు

 కరోనా డెడ్ బాడీతో కేసులు
ముంబై, మే 30,
కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రభుత్వాలు ఎంతో అవగాహన కల్పిస్తున్నా ఇంకా ఎంతో మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. దేశంలో రోజూ వేలాది కేసులు నమోదవుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనం. అక్కడి ఉల్లాస్‌ ‌నగర్‌లో ఇటీవల ఓ మహిళ (40) కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయింది. కొవిడ్ నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్ సిబ్బంది ఆ శవాన్ని బ్యాగులో ప్యాకింగ్ చేసి బంధువులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ బ్యాగును ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. ఆ విషయం పదే పదే సిబ్బంది బంధువులకు చెప్పినా వారు వినిపించుకోలేదు.శ్మశానానికి తీసుకెళ్లి డెడ్బాడీ ఉన్న బ్యాగును తెరిచారు. దీంతో బంధువుల్లో 18 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి సుమారు 100 మంది వరకూ హాజరు కావడం గమనించదగ్గ విషయం. మృతురాలి అంత్యక్రియల తర్వాతి రోజే వచ్చిన ఆమె కరోనా పరీక్షల నివేదికలో పాజిటివ్‌గా తేలడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 50 మందిని ముందు క్వారంటైన్‌‌కు తరలించారు. అందులో 18 మందికి శుక్రవారం పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది.దీంతో ఇప్పుడు మిగతావారిని అధికారులు గుర్తిస్తున్నారు. ఈ ఘటనపై ఉల్లాస్‌నగర్‌‌ మున్సిపల్‌ శాఖ సీనియర్‌ అధికారి మీడియాతో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సంబంధిత బంధువులపై కేసు నమోదు చేస్తామని చెప్పారు

Related Posts