జూన్ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాల కొనసాగింపు: కేసీఆర్
హైదరాబాద్ మే 30
రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు.