ప్రతిపక్ష నేత జగన్‌కు ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తిలో జరిగిన వైసీపీ బహిరంగ సభలో సభా వేదిక కూలి పోయింది. ఈ ప్రమాదంలో జగన్ సురక్షితంగా బయటపడ్డారు. పది మంది వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వైసీసీ అధినేత జగన్ పాదయాత్ర 67వ రోజు జగన్ చేరుకుంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి వద్ద జగన్ పాదయాత్ర 900 కిలోమీటర్లుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ రావిమొక్కను నాటారు.నవంబర్ 6వ తేది నుంచి ‘జగన్ ప్రజా సంకల్ప యాత్ర’కు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. సుమారు 3000 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయనున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లా మీదుగా కొనసాగిన పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది.