వేసవిలో ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహించరాదని, కళాశాలలకు శలవులు ఇవ్వాలని తెలంగాణా రాష్ట్ర టర్మీడియట్ బోర్డు కార్యదర్శి డా. ఏ.అశోక్యాజమాన్యాలను ఆదేశించినారు.ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఈ నెల 15 తారీఖు లోగా తమ కళాశాలల గుర్తింపు కొరకు తగిన పత్రాలను సమర్పించి గుర్తింపు పొందాలని తెలియజేసారు.ప్రైవేటు జూనియర్ కళాశాలలు విద్యార్ధులకు హాస్టల్స్ నిర్వహించ ధలచినచో అపరాధ రుసుము లేకుండా ఈ నెల 15 వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసారు.ప్రైవేటు కళాశాలలజమాన్యాలు కళాశాల అనుబంధ హాస్టల్స్ ను ఏర్పాటు చేసుకోవడంలో బోర్డు నియమ నిబంధనలు కఠీనంగా వున్నాయని వాటిలో కొంత సడలింపులు చేయాలనీ వినతి పత్రాన్ని డా. ఏ. అశోక్, ఐఏఎస్, కార్యదర్శి, ఇంటర్మీడియట్ బోర్డు వారికీ అందజేసారు. వారి వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని బోర్డు కార్యదర్శి తెలియజేసారు.