YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

డ‌బ్ల్యూహెచ్‌వో తో సంబంధాలు కట్ :ట్రంప్

డ‌బ్ల్యూహెచ్‌వో తో సంబంధాలు కట్ :ట్రంప్

 

 డ‌బ్ల్యూహెచ్‌వో తో సంబంధాలు కట్ :ట్రంప్
న్యూ ఢిల్లీ మే 30
ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో సంబంధాల‌ను తెంచుకుంటున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైన‌ట్లు ట్రంప్ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. నెల‌ రోజుల క్రితం డ‌బ్ల్యూహెచ్‌వోకు నిధుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. చైనాకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తోలుబొమ్మ‌లాగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ట్రంప్ ఆరోపించారు. డ‌బ్ల్యూహెచ్‌వోలో స‌మూల మార్పులు జ‌ర‌గ‌కుంటే, శాశ్వ‌తంగా ఆ సంస్‌‌కు నిధుల‌ను నిలిపివేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఎన్ని విజ్ఞ‌ప్తులు చేసినా, కావాల్సిన సంస్క‌ర‌ణ‌ల‌ను డ‌బ్ల్యూహెచ్‌వో చేప‌ట్ట‌లేద‌ని ట్రంప్ విమ‌ర్శించారు. అందుకే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో రిలేష‌న్‌షిప్‌ను వ‌దులుకుంటున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. డ‌బ్ల్యూహెచ్‌వోకు బ‌దులుగా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఆరోగ్య‌ప‌రంగా అత్య‌వ‌స‌ర‌మైన దేశాల‌కు ఆ నిధుల‌ను మ‌ళ్లించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  క‌రోనా వైర‌స్ ప‌ట్ల చైనా నుంచి స‌మాధానం కావాల‌ని ప్ర‌పంచ‌దేశాలు ఆశిస్తున్నాయ‌ని, ఈ విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త అవ‌స‌ర‌మ‌ని ట్రంప్ అన్నారు.

Related Posts