YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నియంత్రిత పంటల పేరిట కేసీఆర్ నియంతృత్వ పాలన

నియంత్రిత పంటల పేరిట కేసీఆర్ నియంతృత్వ పాలన

నియంత్రిత పంటల పేరిట
కేసీఆర్ నియంతృత్వ పాలన
ప్రొ. ఎం.కోదండరాం
జగిత్యాల మే 30
నియంత్రిత పంటల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రో: కోదండరాం అన్నారు. శనివారం మెట్ పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడని బలవంతపు నిర్ణయాలు తీసుకుంటూ, వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. గత ఆరేళ్లుగా పరిపాలిస్తున్న తెరాస సర్కారు ఇప్పటి వరకు ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టలేకపోయిందన్నారు. కనీసం రైతుల అవసరాలు, సమస్యలపై  ఒక రైతు కమిషన్ ఏర్పాటు చేయలేక పోయిందన్నారు. మార్కెట్ కొనుగోళ్లలో ఆలస్యం జరగడం, తూకంలో మోసాలు జరగడంతో అమాయక రైతులు మోస పోతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అప్పటివరకు నడిచిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ని మూసివేయడం చెరకు రైతుల్ని మోసం చేయడమేనని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారితో వివిధ దేశాల నుండి ఉపాధి కోల్పోయి రాష్ట్రానికి తిరిగి వస్తున్న గల్ఫ్ బాధితుల్ని ప్రభుత్వం అడుకోకపోవడం శోచనీయం అని తెలిపారు. కోవిడ్ భాదితులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఇటీవల హైకోర్టు సైతం మొట్టికాయ వేసిందని కోదండరాం గుర్తు చేశారు. ఇప్పటికైనా బలవంతపు పంటల సాగు నిర్ణయాన్ని ప్రభుత్వం  ఉపసంహరించు కోవాలని, రైతు ఋణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి కోరుట్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంతి మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎల్క కమలాకర్, జిల్లా సహాయ కార్యదర్శి చింతకుంట శంకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు అఝారుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కంతి ఆనంద్, మాజీ ఎంపిటిసి గూడా రాజా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఉప సర్పంచ్ గూడ రాంరెడ్డి, మెట్ పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండల ఇన్ ఛార్జ్ లు పసునూరి శ్రీనివాస్, శనిగారపు అశోక్, కంతి రమేష్, నాయకులు కాట దశరథ్ రెడ్డి, రెబ్బటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts