ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది ...? "*
అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే,
దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు.
*నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు.*
నీ మనసును మాత్రం
ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి ...
*నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు ...వాళ్ళు* నీకెంతో ప్రియాతిప్రియమైన
వాళ్ళుగానే వ్యవహరించు.
*నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.*
*ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది.*
*తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది.*
తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది.
*నా బాబువి కదూ,*
*నా తల్లివి కదూ...*
*అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది.*
కాని, ఆమెకు తెలుసు,
*ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.*
*తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా...*
*దాని మనస్సంతా గట్టుమీదే,* తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.
*అలాగే ... నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి.*
*నీ మనసును మాత్రం,*
*ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.*
బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు *అలవడకపోతే ...*
*సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి*
*ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది.*
*సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా* ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది.
ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ ...
*వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.*
పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి.
*లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు.*
*అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో...*
ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు.
*దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.*
*పాల నుంచి వెన్న దొరకదు.*
ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి.
తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది.
*చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది.*
*ప్రపంచం నీళ్ల లాంటిది.*
మనస్సు పాల లాంటిది.
పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా
కలిసి ఏకమవుతుంది.
*వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.*
*అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి.*
*జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి.*
*ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.*
*ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం !!*
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో