YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గేటెడ్ కాల‌నీల్లో కంపోస్ట్ ఎరువుల త‌యారీ కేంద్రాలు

గేటెడ్ కాల‌నీల్లో కంపోస్ట్ ఎరువుల త‌యారీ కేంద్రాలు

ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు అన్ని గేటెడ్ క‌మ్యూనిటీ కాల‌నీల్లో కంపోస్ట్ ఎరువుల త‌యారీ యూనిట్ల‌ను ఏర్పాటు చేయాల‌న్న ల‌క్ష్యాన్ని అనుస‌రించి అన్ని కాల‌నీల్లో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

బ‌యో డీగ్రేడ‌బుల్ వ్య‌ర్థాలైన కూర‌గాయ‌ల వ్య‌ర్థాలు, ఆకులు, ఆహార వ్య‌ర్థాల‌ను కంపోస్ట్ పిట్‌ల‌లో వేయ‌డం ద్వారా మంచి ఎరువై కాల‌నీల్లోని పార్కులు, ఇళ్ల‌లోని మొక్క‌ల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని ఆయా కాల‌నీ సంక్షేమ సంఘాల‌కు జీహెచ్ఎంసీ అధికారులు చైత‌న్యప‌రుస్తున్నారు. ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌ నిబంధ‌న‌లు- 2016ను అనుస‌రించి 5వేల చ‌.మీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న గేటెడ్ కాల‌నీల‌న్నింటిలో త‌ప్ప‌నిస‌రిగా అంత‌ర్గ‌తంగా కంపోస్టింగ్ యూనిట్‌ల‌ను ఏర్పాటు చేసుకోవాల్సి  ఉంటుంది. కాల‌నీలో సామాజిక కంపోస్ట్ గుంత‌ల‌ను నిర్మించుకోవ‌డంతో పాటు కంపోస్ట్ ఎరువుల త‌యారీ మిష‌న్ల స‌మాచారాన్ని కూడా ఆర్‌.డ‌బ్ల్యూ,ఏల‌కు జీహెచ్ఎంసి అందిస్తోంది. బ‌ల్దియా వెబ్‌సైట్‌ లో కంపోస్ట్ ఎరువుల త‌యారీ మిష‌న్లు, త‌యారీ సంస్థ‌లు, వాటి ప‌రిమాణం, ధ‌ర‌తో పాటు అవి దొరికే సంపూర్ణ వివ‌రాలను పొందుప‌ర్చారు. ఇప్ప‌టికే కంపోస్ట్ మిష‌న్ల‌ను ఏర్పాటు చేసుకున్న ప‌లు కాల‌నీల‌కు చెందిన స‌మాచారాన్ని కూడా ఇత‌ర కాల‌నీ సంక్షేమ సంఘాల‌కు అంద‌జేశారు. ప్ర‌ధానంగా స‌న‌త్‌న‌గ‌ర్‌లోని చెక్ కాల‌నీలో 25 కిలోల సామ‌ర్థ్యం గ‌ల కంపోస్ట్ మిష‌న్ ద్వారా ఎరువుల త‌యారీతో అద‌న‌పు ఆదాయం పొందుతున్న అంశాన్ని కూడా తెలియ‌జేస్తుంది. శివ‌రాంప‌ల్లిలోని బ‌హుళ జాతి సంస్థ వాల్‌మార్ట్ ప్ర‌తిరోజు 50కిలోల సేంద్రియ ఎరువు త‌యారుచేసే యూనిట్‌ను ఏర్పాటు చేసింది. థెర్మోఫిలిక్‌, మైక్రో ఆర్గానిజం ప్ర‌క్రియ ద్వారా ప్ర‌తిరోజు 50కిలోల కంపోస్ట్ ఎరువుల‌ను త‌యారు చేయ‌డం, గ‌చ్చిబౌలిలోని ఎల్ అండ్ టి సెరేన్ కౌంటి కాల‌నీలో రాలిన ఆకులు, వృక్ష సంబంధిత వ్య‌ర్థాల‌ ద్వారా ప్ర‌తిరోజు 45కిలోల ఎరువుల తయారీ విధానం, గ‌చ్చిబౌలిలోని రోలింగ్ హిల్స్ కాలనీలో అస్బెస్టాస్ మెట‌ల్ కంటైన‌ర్ ద్వారా నెల‌కు 100కిలోల ఎరువుల త‌యారీ విధానాన్ని, మూసాపేట్ మిస్టిక్ హిల్స్‌లో వ‌ర్మికంపోస్ట్ ద్వారా 75కిలోల ఎరువుల త‌యారీ, కామినేని ఆసుప‌త్రిలో నెల‌కు 200కిలోల ఎరువుల త‌యారీ, ఉప్ప‌ల్ స‌ర్కిల్ కార్యాల‌యంలో క‌మ్యునిటీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు వివ‌రాల‌తో పాటు వాటి ద్వారా పొందే లాభాలు, వాటిని గార్డెనింగ్‌కు ఉప‌యోగించే అంశాలు కూడా ఇత‌ర కాల‌నీల‌కు తెలియ‌జేస్తున్నారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు అన్ని గేటెడ్ క‌మ్యునిటీ కాల‌నీల్లో కంపోస్ట్ యూనిట్ల‌ను ఏర్పాటు చేసేందుకుగాను ప్ర‌తిరోజు క‌నీసం మూడు గేటెడ్ క‌మ్యూనిటీల‌ను సంద‌ర్శించి ఆయా కాల‌నీ సంక్షేమ సంఘాల‌ను క‌లిసి చైత‌న్య‌ప‌ర్చాల‌ని డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌కు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్‌్న్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 

Related Posts