YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పేరుకు మాత్రమే  ప్లాస్టిక్  బ్యాగ్స్ నిషేధం

పేరుకు మాత్రమే  ప్లాస్టిక్  బ్యాగ్స్ నిషేధం

పేరుకు మాత్రమే  ప్లాస్టిక్  బ్యాగ్స్ నిషేధం
ఏలూరు జూన్ 1,
ప్లాస్టిక్  రహిత సమాజమే లక్ష్యమనిచెప్పే అధికారులకు ఎక్కడికక్కడ గుట్టలుగా ప్లాస్టిక్‌ కవర్లు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కువగా ప్లాస్టిక్‌ వాడకం వల్ల పర్యావరణం కాలుష్యమై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం శీతాకాలం, వర్షాకాలంలో కూడా వేడి పెరగడానికి ప్లాస్టిక్‌ వాడకమే కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. 40 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం గల కవర్లను వాడడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందఁ హెచ్చరిస్తున్నారుప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి ముప్పు అన్ని తెలిసినా అధికారులు వాటి నివారించడంలో విఫలమౌతున్నారు. ప్లాస్టిక్‌ వాడితే కేసులు, జరిమానా అంటూ ఆర్భాటాలే తప్ప చేసేదేమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. . అయితే హోటల్‌, చిల్లర దుకాణాలు, మార్కెట్‌లో, కూల్‌డ్రింక్‌షాపుల్లో ప్లాస్టిక్‌ కవర్లను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నా అధికారుల దాడులు మాత్రం నామమాత్రమే. గతంలో దుకాణానికి వెళ్తే సంచి పట్టుకుని వెళ్లేవారు. ప్రస్తుతం దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్లు ఇస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కవర్లు దర్శనమిస్తున్నాయి. వాటిని ఆవులు, మేకలు తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్లాస్టిక్‌ వల్ల  అనర్థాలు జరుగుతున్నా వాటిని వీడడం లేదు. వేడి పదార్థాలను కవర్లలో వేయడం వల్ల ప్లాస్టిక్‌ కరిగి కొత్త రోగాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లను కాలిస్తే దాఁనుంచి వెదజల్లే విషవాయువులు ఊపిరితిత్తులకు  హాని కలిగిస్తాయని వైద్యులు అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ కవర్లు పారేయడంతో అవి డ్రెయినేజీల్లో అడ్డుపడి మురుగునీరు ప్రవహించడం లేదు. దీంతో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా తయారై దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇటీవలకాలంలో నరసాపురం పట్టణం, మండలంలో ప్రతి దుకాణంలోనూ ప్లాస్టిక్‌ కవర్లను విఁయోగిస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకఁన్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాస్టిక్‌ విక్రయ దుకాణాలపై దాడులు నిర్వహించాలని  ప్రజలు కోరుతున్నారు. 
=======================

Related Posts