YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీ కార్యక్రమాల వైపు సజ్జల

పార్టీ కార్యక్రమాల వైపు సజ్జల

పార్టీ కార్యక్రమాల వైపు సజ్జల
విజయవాడ, జూన్ 1,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. సంక్షేమ పథకాల అమలు, మ్యానిఫేస్టో అంశాలను గ్రౌండ్ చేయడంపైనే జగన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయనకు అంత సమయం కూడా లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలను మరో నేతకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ పనులు అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలిసింది.జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తుంది. ఈ ఏడాదిలో జగన్ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది అస్సలు లేనే లేదని చెప్పాలి. పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు కోవిడ్ దెబ్బకు పూర్తిగా సమీక్షలకే జగన్ పరిమితమవుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత వేగం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా రానున్న ఏడాది అభివృద్ధి కార్యక్రమాలకే జగన్ పెద్దపీట వేయనున్నారు.ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఇకపై అభివృద్ధి పనులపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి వసతితో పాటు ప్రాజెక్టు పనులను కూడా సత్వరం పూర్తి చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఇటు పార్టీని చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో వైసీపీలో గ్రూపులు ఏర్పడ్డాయి. నేతల మధ్య వైరుధ్యాలు పార్టీని ఇబ్బందిపెడుతున్నాయి. ఇప్పటి వరకూ జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అయిందీ లేదు.ఈ నేపథ్యంలో జగన్ పార్టీ కార్యక్రమాలను పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఉన్నా రానున్న కాలంలో ఆయన ఢిల్లీలో రాజకీయాలు నెరపాల్సిన పని ఉంది. దీంతో సజ్జలకు పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీలో విభేదాలతో పాటు, ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించి వాటిని సాల్వ్ చేసే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డికే అప్పగిస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. మొత్తం మీద జగన్ పార్టీని కూడా గాడిలో పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Related Posts