YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఆగస్టు 8న రాణా పెళ్లి

ఆగస్టు 8న రాణా పెళ్లి

ఆగస్టు 8న రాణా పెళ్లి
హైద్రాబాద్, జూన్ 1
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సడెన్‌గా తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. తాను మిహికా బజాజ్ త్వరలో పెళ్ళాడబోతున్నట్టుగా ప్రకటించాడు. వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరు వైపులా అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. అందులో భాగంగా ఈ నెల 21న రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక పూర్తి కాగా, మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం జరుగనుంది. ఆ తర్వాత ఆగస్ట్‌లో వీరి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అందులో భాగంగా రానా తండ్రి సురేష్ బాబు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని చకా చకా చేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే పెళ్లి జరుపనున్నారని.. అది కూడా కొద్ది మంది బంధువులు, సన్నిహితలు సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. రానా, మిహీకా బజాజ్‌లు ఆగష్టు 8న పెళ్లి బంధంతో ఏకం కానున్నారని సమాచారం. లాక్ డౌన్ నిబంధనలు కూడా సవరించడంతో వీరి పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. 

Related Posts