పాక్ గూఢచర్యం..భారత్ యాక్షన్
న్యూఢిల్లీ, జూన్ 1,
దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పాక్ హైకమిషన్ సిబ్బందిని ఆర్మీ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీలక సమాచారాన్ని పంపడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు సిబ్బందిని ఢిల్లీలోని పాక్ హైకమీషన్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. హైకమిషన్ ఆఫీసులో విధులు నిర్వహిస్తోన్న అబిద్ హుస్సేన్, తహీర్ ఖాన్‌తోపాటు జావేద్ హుస్సేన్‌ల అనే కు పాక్ గూఢచారి సంస్థతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. వారిని సోమవారం ఉదయమే దేశం విడిచివెళ్లాలని హుకుం జారీచేశారు. చివరిసారిగా పాక్ దౌత్య సిబ్బందిని 2016లో భారత్ నుంచి బహిష్కరించారు. తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. ‘దౌత్య మిషన్ సభ్యులుగా చట్ట విరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ అధికారులను వ్యక్తిగతంగా 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళమని ప్రభుత్వం కోరింది’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత జాతీయ భద్రతకు వ్యతిరేకంగా ఈ అధికారుల కార్యకలాపాలకు సంబంధించి పాక్ ప్రభుత్వానికి తీవ్ర నిరసనను తెలిపింది. దౌత్య మిషన్‌లోని ఏ ఒక్క సభ్యుడు భారత్‌లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనకూడదని, దౌత్య హోదాకు విరుద్ధంగా వ్యవహరించకూడదని కోరింది. అయితే, భారత్ వాదనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. తమ దౌత్య సిబ్బంది ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని, అవన్నీ నిరాధారమైనవని వ్యాఖ్యానించింది. అంతేకాదు, తప్పుడు ఆరోపణలతో తమ దౌత్య సిబ్బందిని బహిష్కరించి, వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని పాక్ విమర్శలు గుప్పించింది. పాక్ విదేశాంగ శాఖ మరో అడుగు ముందుకేసి తమ సిబ్బందిని భారత్ హింసించింద, దౌత్యవేత్తలను నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. జమ్మూ కశ్మీర్‌లో దిగజారుతున్న పరిస్థితి, మానవ హక్కుల ఉల్లంఘనలు, బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి ఈ తమపై ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పాక్ పేర్కొంది. ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం జ