YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నిరుద్యోగులే అతడి టార్గెట్ ..ప్రభుత్వ ఉద్యోగాలే ఎర

నిరుద్యోగులే అతడి టార్గెట్ ..ప్రభుత్వ ఉద్యోగాలే ఎర

ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు నిరుద్యోగులు అత్యాశకు పోయి మోసగాళ్ళ మాయలో పడిపోతున్నారు.గుట్టుచప్పుడు కాకుండా ఛీటర్ల మాటలు నమ్మి లక్షలు సమర్పించుకుంటున్నారు. ఇలా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి అందినకాడికి దోచుకునే మోసగాళ్ళ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిలువు దోపిడి చేసిన నిందితున్ని సెంట్రల్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల నుంచి కోటి 60 లక్షల వసూలు చేశాడని, నిందితునుంచి నాలుగు లక్షల నగదు, నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు తెలిపారు. పాతబస్తి ఆజంపుర కు చెందిన బద్దం ఎల్లేశ్ డిగ్రీ వరకు చదివి బార్ షాపు లో పనిచేశాడు. బార్ మూసివేయడంతో జాబ్ కోసం వెతుకుతున్న సమయంలో సెక్రటేరియట్ లో పనిచేస్తున్నానంటూ రవీంద్ర స్వామి పరిచయం అయ్యాడు. జీహెచ్ ఎంసీ, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ శాఖ,  పలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు .దీంతో ఎల్లేశ్ 2 లక్షలు ఇచ్చాడు.అయితే ఒకేసారి ఎక్కువ మందిని చేర్పిస్తే తక్కువ ఖర్చు ఉంటుందని  అందుకు తెలిసిన వారికి చెప్పమన్నాడు.దీంతో ఎల్లేష్ 37 మంది నిరుద్యోగుల నుంచి కోటి 60 లక్షలు వసూలు చేసి రవీంద్ర స్వామికి ఇచ్చాడు.అందులో కొంత డబ్బును ఎల్లేశ్ కు ఇచ్చాడు.కరీం నగర్ లో రవీంద్ర స్వామిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.అయితే ఈజీ మనీ కోసం ఎల్లేశ్ కూడా నిరుద్యోగులను ఎంచుకుని డబ్బులు వసూలు చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికిపోయాడు.నిందితుని నుంచి ఫేక్ ఐ.డి లు.ఆపాయింట్ మెంట్ ఆర్డర్స్.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.ప్రతి నోటిఫికేషన్ ఆన్ లైన్ లో ఉంటుందని.ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిరుద్యోగులకు సూచించారు.మాయ మాటలు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామనే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ డిసిపి రాధా కిషన్ రావు తెలిపారు.

Related Posts