YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

సావర్కర్' ని స్వాతంత్ర్య వీర సావర్కర్ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా?

సావర్కర్' ని స్వాతంత్ర్య వీర సావర్కర్ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా?

సావర్కర్' ని స్వాతంత్ర్య వీర సావర్కర్ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా?
సావర్కర్ తో సావాసం  ఎవరైనా చేస్తే , అంటే  కలిసినా, మాట్లాడినా, చేతులు కలిపినా, చర్చించినా,ఆయన కవితలు విన్నా, ఆయన రాసిన పుస్తకాలు చదివినా చాలు.. ఇంతెందుకు సావర్కర్ ని కళ్లల్లో కళ్లు పెట్టి చూసినవాడెవడైనా, ఆయన ప్రసంగాలు విన్నవారెవరైనా సరే...ఎలెక్ట్రిక్ షాక్ తగిలి 'స్వాంత్రంత్య్రం..స్వాతంత్ర్యం' అంటూ  దేశ భక్తులు కావాల్సిందే. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేయాల్సిందే... అదీ సావర్కర్ సత్తా అంటే. సావర్కర్ ని చూసి ఆంగ్లెయులు జడుసుకున్నారు. సావర్కర్ ని చూసి కాంగ్రెస్ ముఖ్యంగా గాంధీ నెహ్రూల నోట మాట రాలేదు. నెహ్రూ ప్రభుత్వం, గాంధీ హత్య ని సావర్కర్ పై త్రోసి జైల్లో పెట్టించి, హంతకుడిగా, తీవ్రవాది గా చిత్రించినది. సావర్కర్ చేసిన ఘన త్యాగాల ముందు తమ ఆటలు వెలవెల పోతాయని భావించి, శాశ్వతంగా సావర్కర్ వీర గాథలను తొక్కి పెట్టాలని చూశారు. 70 సంవత్సరాలుగా వెలుగుచూడని సావర్కర్ ఆత్మ మళ్ళీ మెల్కొన్నది.ప్రపంచ రాజకీయ చరిత్ర లోనే రెండు సార్లు ఆజీవన కారాగార శిక్షను (50 సంవత్సరాలు)పొందిన మొదటి రాజకీయ ఖైదీ, ఏకైక శత్రు భయంకరుడు స్వాతంత్య్ర వీర సావర్కర్.ప్రపంచ చరిత్ర లోనే కలం, కాగితం లేకుండా, జైలు గొడలపై రాళ్లతో, ఇనుప మేకులతో కవితలు, శ్లోకాలు వ్రాసిన మొట్ట  మొదటి కవి, రచయిత సావర్కర్.  సావర్కర్ వ్రాసిన '1857 స్వాతంత్య్ర పోరాటం' పుస్తకం ప్రచురించక ముందే నిషేధించబడిందంటేనే సావర్కర్ కలం తుపాకీ కంటే ప్రమాదం అని మనం అర్థం చెసుకొవచ్చును.. ఒక్క సావర్కర్ వల్లనే ఆంగ్లెయులకు రాత్రి నిద్ర పట్టడం లేదు ఈయన గారి పుస్తకాలు చదివి,  వందలాది మంది సావర్కర్ లు తయారైతేనో ....అందుకే ప్రచురణకు నోచుకోక  ముందుగానే నిషేదం ప్రపంచ చరిత్రలోనే అపుర్వమైనది. దేశంలోని మెజారిటీ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ప్రపంచం లోనే అఖండ భారత్ గా ఏర్పాటు కావాలన్నది సావర్కర్ కోరిక. రానున్న కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ది చెంది గొప్పగా మహోన్నతంగా సూర్యుడి సాక్షిగా హిందూ దేశంగా వెల్గొందుతుందనీ, అలా కాకపొతే నన్ను పగటి కలలు కన్న వ్యక్తిగా, అలాగే జరిగితే నన్నొక ప్రవక్తగా ముందుంటానని చెపుతూ ఆ పనిని మీకు అప్పజెప్పుతున్నానని డంఖా బజాయించి మరీ చెప్పాడు. ఒకసారి జైళ్లో సావర్కర్ ని నిరాశా నిస్పృహ లకు గురిచేసి, ఆత్మ స్థైర్యం దెబ్బ తీయాలని ఆంగ్లేయులు ఒక పథకం వేశారు.10,15 మంది విప్లవ వీరులను ఒక్క దగ్గరే నిలబెట్టి, సావర్కర్ కి ఎదురుగానే  చిత్ర హింసల పాల్జెస్తుంటే, అది చూసి సావర్కర్ తో సహా  విప్లవవీరులు కూడా పిరికివారై పోతారని ఆంగ్లేయులు  భావించారు. కాని విశేషమేమిటంటే  ఆ వేళ పోలీసులు కర్రలతో చావ బాదుతున్నప్పుడు  సావర్కర్ చేసిన స్వాతంత్య్ర నినాదాలు విని వీరుల  మనోబలాలు పెరిగాయి. కాని ఆంగ్లేయుల మనో నిబ్బరం మాత్రం దెబ్బతిన్నది. అదీ సావర్కర్ సింహ పరాక్రమం... 

ఇప్పుడర్థమైందా_సావర్కర్_చరిత్రకు_కాంగ్రెస్_ఎందుకు_మసి_పూసిందో?..అలుపెరుగని అవిశ్రాంత యోధుడు, మండుతున్న కష్టాల  కొలిమిలో  అగ్గి పిడుగు ఈ ఉక్కుమనిషి. తల్లిదండ్రులు, సంతానం అసువులు బాసినా, అన్నలు తమ్ములతో సహా కుటుంబమంతా స్వాంత్రంత్య్ర యజ్ణకుండంలో సమిధలైనా, వీర సావర్కర్ సహనం, ధైర్యం, సాహసం, దూరదృష్టి , పట్టుదల అంకిత భావం, ఆత్మ విశ్వాసం కలిగి, లక్ష్యం, ధ్యేయం  కోసం సంకల్ప బలం  కలిగిన ధీరోదాత్తుడు. చిత్రహింసలు, బెదిరింపులు, హెచ్చరికలు, ప్రలొభాలకు లొంగని అసమాన,అసాధారణ  శక్తివంతుడు. లండన్ నుండి బయలు దేరిన ఓడ నుండి మరుగుదొడ్డి ద్వారా సముద్రంలో దూకి, ఈదుతూ ఫ్రాన్స్ సరిహద్దులు చేరిన పరాక్రమవంతుడు. అండమాన్ జైల్లో కొబ్బరి కాయల పీచు పీకడం, నూనె తీసే గానుగలను, ఎద్దులు బదులుగా సావర్కర్ తో త్రిప్పించి, కొరడా దెబ్బలతో దేహాన్ని హూనం చేస్తుంటే రక్తం కారుతున్నా, కదలని, మెదలని, దిగజారని ఆత్మ బలం గల స్వాభిమాని.

Related Posts