YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర జల సంఘం

కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర జల సంఘం

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రాజేక్టు పూర్తి అయితే తెలంగాణ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసుద్ హుస్సేన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా సోమవారం నాడు మేడారం వద్ద నిర్మాణంలో ఉన్న ప్యాకేజి 6 టెన్నల్ పనులను కేంద్రజలవనరుల సంఘం చైర్మన్, సభ్యులతోపాటు మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ప్రాజెక్టు పనులు పరిశీలించటం కోసం కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్, సభ్యులతో పాటు మంత్రి హరీష్ హైద్రాబాద్ నుండి హెలిక్యాప్టర్ లో బయలుదేరి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద జరుగుతున్న పనులు పరిశీంచి అక్కడినుండి బయలు దేరిన బృదం పెద్దపల్లి జిల్లా సుందిల్ల, అన్నారం పంప్ హౌజ్ పనులను ఎరియల్ వ్యూ ద్వార పరిశీలించి మేడారం వద్దకు చేరుకుని టెన్నేల్ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును హరీష్ రావు బృందం సభ్యులకు వివరించారు, కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసుద్ హుస్సేన్ మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పనులు అత్యంతవేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు తెలంగాణ రైతులకు చాల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పెద్ద ప్రాజెక్టు నిర్మాణం పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్ రావు, అతని బృందాని అభినందిస్తున్నామన్నారు

Related Posts