YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి జగనన్న పోరాటం ఎమ్మెల్యే ఆర్ కే రోజా

అరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి జగనన్న పోరాటం ఎమ్మెల్యే ఆర్ కే రోజా

అరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి జగనన్న పోరాటం 
- ఎమ్మెల్యే ఆర్ కే రోజా
పుత్తూరు జూన్ 1 
ఆంధ్ర ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో పోరాటం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఛైర్ పర్సన్  గా  ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వైయస్సార్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే జగనన్న ఆరోగ్యశ్రీ తో పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని అందుకు తగ్గ సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు.  ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి రాష్టాన్ని ఆరోగ్యాంద్రప్రదేశ్ గా చేయాలనే  దృడ నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు ప్రభుత్వ వైద్యశాల నూతన కమిటీ ఏర్పాటు చేశారు.   ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.  పేద ప్రజలు ఆరోగ్యం కోసం గతంలో ఏదైనా వ్యాధులు వస్తే అప్పులు పాలై పరిస్థితి ఉండేది.  అయితే  దాని నుండి పేదల కోసం దివంగత నేత వైయస్ రాజశేకర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.  పేదవారికి కార్పోరేట్ స్దాయిలో మంచి వైద్యం అందించారని,  అందుకే ఆయన దేవుడిగా కొలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి రాజు, డాక్టర్ ప్రభావతి, డాక్టర్ నవీన్, వైద్య సిబ్బంది, వైకాపా నాయకులు రవీంద్ర, చిట్టి మోహన్ రెడ్డి,  హరి మోహన్ తదితరులు పాల్గొన్నారు

Related Posts