YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఈ నెల 14 నుంచి మే 5 వ‌ర‌కు గ్రామ్ స్వరాజ్ అభియాన్

Highlights

  • ఈ నెల 14 నుంచి మే 5 వ‌ర‌కు  గ్రామ్ స్వరాజ్ అభియాన్ 
  • బిజెపి రాష్ట్ర అద్యక్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్
ఈ నెల 14 నుంచి మే 5 వ‌ర‌కు  గ్రామ్ స్వరాజ్ అభియాన్

సమర్ధవంతమైన ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో బడుగు, బలహీన వర్గాలు, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు చేపట్టిందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జాతీయ అధ్యక్షులు అమిత్ షా పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి మే 5 వరకు గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని మండలాలు, జిల్లాలు, అసెంబ్లీ కేంద్రాల్లోనూ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంధర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ఇందులో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసేందుకు అసెంబ్లీ కేంద్రాల్లో టీవీల ద్వారా వీక్షేంచుందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.దళితుల అభివృద్ధి, వికాసం కోసం, దళితుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వా చేపట్టిన కార్యాక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లు, ముఖ్యంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న అన్ని ఘట్టాలను స్ఫూర్తి కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దిందని తెలిపారు. ప్రధానంగా అంబేద్కర్ జన్మించిన మౌ గ్రామం నుంచి మొదలుకుని.. అంబేద్కర్ అంతిమయాత్ర ప్రదేశం వరకు పంచతీర్ధ పేరిట మౌ, ఢిల్లీ, లండన్, నాగ్పూర్ వంటి ప్రాంతాలను విజ్ఞాన, స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేసిందన్నారు.దళిత యువతీయువకులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చదువుకున్న దళిత యువతకు స్టాండప్ ఇండియా ద్వారా కేంద్రబడ్జెట్లో మొదటి విడతగా 500 కోట్ల రూపాయలను కేటాయించిందని, దీంతో 35 వేల మంది దళిత యువతీయువకులను మోదీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దిందన్నారు.70 ఏళ్ల స్వతంత్ర భారంతంలో40 శాతం జనాభాకు కనీసం మరుగుదొడ్ల వసతి కూడా లేకుండేదని, కానీ...మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా 9 కోట్ల ప్రజలకు మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 9 వేల రూపాయలు ఇచ్చి.. వాటిని మహిళల ఆత్మగౌరవాలయాలుగా నామకరణం చేశారన్నారు. మహిళలు కట్టెల పొయ్యిలతో వంట చేస్తూ.. కంటనీరు పెట్టకుండా ఉండేలా... ఉజ్వల పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా..తెలంగాణలోని సూర్యాపేటలో కేంద్ర మంత్రివర్యులు దేవేంద్ర ప్రధాన్ ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 25 లక్షల మంది ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందారని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.ఏప్రిల్ 18న స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఇందులో భాగంగా రాష్ట్రం, దేశ వ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్లు లేనటువంటి ఇళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20న ఉజ్వల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు..ఇందులో భాగంగా రేషన్ కార్డులు లేని పేదలను గుర్తించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అనేక పంచాయతీలు, మునిసిపాలిటీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీలు రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలు లేక, నిధుల లేమితో అల్లాడుతున్నాయని, దీనికోసం ఏప్రిల్ 24న పంచాయత్ రాజ్ దినోత్సవం సందర్భంగా. నిధులు పంపించే కార్యక్రమం చేపడుతున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రతిపంచాయతీకి లక్షల నిధులను కేటాయిస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంచాయతీలకు అందకుండా చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.గ్రామాల్లో పేదరిక నిర్మూళన కోసం, పేదలకు నిలువ నీడ కల్పించాలన్న లక్ష్యంతో ప్రధాని ఆవాస్ యోజన పథకంలో భాగంగా పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికోసం ఏప్రిల్ 28న గ్రామ్ శక్తి అభియాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే అత్యంత ఆకర్షణీయమైన జీవిత బీమా పథకం అయిన ఆయుష్మాన్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా... 50 కోట్ల ప్రజలకు, ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు బీమా వర్తించేలా కేంద్రం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఏప్రిల్ 30న దీనిపై విస్తృత ప్రచారం కల్పించేలా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. మే 2 న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కిసాన్ కల్యాణ్ కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతాంగం కోసం తీసుకుంటున్న చర్యలను ప్రచారం చేస్తామన్నారు.2019లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే 2 లక్షల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని, రైతులకు పంటపొలాల్లో ఉచితంగా బోర్లు వేస్తామని డాక్టర్ లక్ష్మన్ హామీ ఇచ్చారు. అలాగే రైతులపై వడ్డీ భారం పడకుండా..వడ్డీలేని రుణాలను ఇస్తామని, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మధ్యప్రేదేశ్లో బిజెపి ప్రభుత్వం వడ్డీలేని రుణాలిచ్చిందని, అలాగే రాష్ట్రంలో రైతులకు వడ్డీలేని రుణాలిచ్చి అన్నదాతలకు భరోసా కల్పించేలా, వ్యవసాయాన్ని పండగలా మార్చుతామని, ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేస్తామని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. చదువుకున్న యువతకోసం దేశవ్యాప్తంగా 4 వేల మేళా కేంద్రాలను ఏర్పాటు చేశారని, దీనికి సంబంధించి ఈ నెల మే 5న వాజీవిక, కౌశల్ వికాస్ కార్యక్రమాన్నినిర్వమిస్తామని తెలిపారు. మోదీ నాలుగేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శక పాలన అందించిందని, ఫలితంగా లక్షా 85 వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వ ఖజానాకు సమకూరిందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.కేవ‌లం ఓట్ల కోసమే ద‌ళితుల ప‌ట్ల స‌వ‌తిత‌ల్లి ప్రేమ ఒల‌క‌బోస్తూ.. వారిని ఓటర్లుగానే ప‌రిగ‌ణిస్తున్నార‌ని, టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ద‌ళితుల ప‌ట్ల ఎలాంటి వైఖ‌రిని అవ‌లంభిస్తున్నాయో ప్ర‌జ‌లు, ద‌ళిత స‌మాజం గ‌మ‌నిస్తుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల‌కు త‌గిన బుద్ధి చెప్పేందుకు ప్ర‌జ‌లు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.

Related Posts