YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ధి పనుల బిల్లుల  మంజూరు కై న్యాయ పోరాటాలు 

అభివృద్ధి పనుల బిల్లుల  మంజూరు కై న్యాయ పోరాటాలు 

అభివృద్ధి పనుల బిల్లుల  మంజూరు కై న్యాయ పోరాటాలు 
టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్
నెల్లూరు జూన్ 1 
తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల తాలూకు బిల్లుల చెల్లింపులను వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకుంటోందని జిల్లా టిడిపి అధ్యక్షులు, శాసన మండలి సభ్యుడు  బీదా రవిచంద్ర ఆరోపించారు. సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో అయన మాట్లాడారు. ఎమ్మెల్సీ  మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన అభివృద్ధి పనుల తాలూకు బిల్లుల బకాయి లను నిలిపివేసి , వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనుల తాలూకు బిల్లులను మాత్రం వెను వెంటనే మంజూరు చేస్తూ పక్షపాత ధోరణి చూపుతోంది. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల తాలూకు బిల్లులను  కక్షపూరితంగా అడ్డుకోవడంతో  కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి పనుల నే సాకు చూపి బిల్లులను ఇష్టారాజ్యంగా అడ్డుకుంటే చూస్తూ సహించం ,అండగా నిలిచి  న్యాయస్థానాలలో పోరాటాలు చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో  అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అండగా ఉన్నారు. బిల్లుల మంజూరు కోసం  ప్రత్యేక చొరవ తీసుకుని  న్యాయ పోరాటం చేసేందుకు ప్రత్యేక లీగల్ సెల్ అందుబాటులోకి తెచ్చారు.బిల్లులు మంజూరు అయ్యేంతవరకు న్యాయస్థానాలలో పోరాటాలు చేస్తాం, ప్రభుత్వ పక్షపాత ధోరణి ఎండగడతాం .ఏడాది వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ది  పదేళ్లు వెనక బడింది. అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలు లో పూర్తిగా విఫలం చెందింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది నిలిచిపోవడం తో పాటు , ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేసింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై  , వైసీపీ నాయకుల అవినీతి పై ప్రజలలో చైతన్యం కలిగించేలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి. పై ఈ సమావేశంలో జిల్లా తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు, నుడా మాజీ డైరెక్టర్ ఖాజావలి , క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు సురేంద్రబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షులు రంగారావు, పెన్నా డెల్టా వైస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు , బి. మనోహర్ రెడ్డి, టిడిపి నాయకులు,  ఆత్మకూరు నియోజకవర్గంలోని  6 మండలాల తెదేపా ముఖ్య నాయకులు  పాల్గొన్నారు

Related Posts