YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా తీర్థం పుచ్చుకున్న టిడిపి నాయకులు

వైకాపా తీర్థం పుచ్చుకున్న టిడిపి నాయకులు

వైకాపా తీర్థం పుచ్చుకున్న టిడిపి నాయకులు
నెల్లూరు జూన్ 01
ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామానికి చెందిన తూమాటి దయాకర్ రెడ్డి  మాజీ జడ్పీ చైర్మన్  జిల్లా  టి డిపి నాయకుడు  బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అనుచరుడు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం  ఆత్మకూరు పట్టణంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన తూమాటి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్రాభివృద్ది కోసం చేపట్టిన కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.   తూమాటి దయాకర్ రెడ్డి పార్టీలో చేరడంతో వారి స్వగ్రామమైన బట్టేపాడులో వైఎస్సార్సీపీ పట్టు సాధించినట్లు అయింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ఆదిశేషయ్య, వాశిపల్లి లక్ష్మిరెడ్డి, బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, వెంకట రామిరెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, బాబుల్ రెడ్డి, రాజారెడ్డి, వెంకు రెడ్డి, పొలుకూరు  సుధాకర్ రెడ్డి, గోపిశెట్టి శ్రీనివాసులు, జిలుమూడి శ్రీనివాసులరెడ్డి, రాంపల్లి సుబ్బారెడ్డి, దగ్గుమాటి మదన్ రెడ్డి , చిల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts