లేకుంటే మనలో లోపం ఉన్నట్టే: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాల్సిందేనని, లేకుంటే మనలో లోపం ఉన్నట్టేనని చంద్రబాబు.. నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.ఆదివారం అమరావతిలో జరుగుతున్న టీడీపీ ఒక్క రోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ..వచ్చే మూడు, నాలుగు నెలల్లో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత తేజం కార్యక్రమం చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం అమరావతిలో జరుగుతున్న టీడీపీ ఒక్క రోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ చేసినంత లబ్ధి ఎవ్వరూ చేయలేదని అన్నారు. ప్రతిపక్షాలు తుని ఘటన, అమరావతి, పట్టిసీమ, పోలవరం విషయాలపై.. దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ నిధులు రావాల్సి ఉందని, రెవెన్యూ లోటు భర్తీ చేయాలని అన్నారు.