YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కుల వృత్తిదారులకు హైదరాబాద్లో శాశ్వతంగా శిక్షణ కేంద్రం

Highlights

  • కుల వృత్తిదారులకు హైదరాబాద్లో శాశ్వతంగా శిక్షణ కేంద్రం
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
కుల వృత్తిదారులకు హైదరాబాద్లో శాశ్వతంగా శిక్షణ కేంద్రం

రాష్ట్రంలోని అన్ని కులాల వృత్తిదారులకు హైదరాబాద్లో శాశ్వతంగా ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న వెల్లడించారు. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుల వృత్తిదారునికి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కులాల వారీగా ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కుల వృత్తులన్నింటికి పూర్వ వైభవం తీసుకుని రావడమే సీఎం కేసీఆర్ స్వప్నమని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే కుల వృత్తిదారులకు ప్రత్యేక శిక్షణ కోసం హైదరాబాద్లో శాశ్వతంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జోగు రామన్న ప్రకటించారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రలల్లో ఉన్న కుల వృత్తులకు సంబంధించిన భారీ ఎగ్జీబీషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మట్టి గణపతులు, కొబ్బరి నార గణపతులను మాత్రమే ఇక నుంచి ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు. గుజరాత్లోని మాటికామ్ కళాకారి, మిట్టికూల్ సంస్థలతో కుమ్మర కులస్తుల కోసం ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు ఆయన తెలిపారు. గుజరాత్లో మిట్టికూల్ సంస్థ దాదాపు 100 రకాల మట్టి ఉత్పత్తులు చేస్తోందన్నారు. మట్టితో ఫ్రిడ్జ్, లాంతర్లు, హాండలు,వాటర్ బాటిల్స్, కూలర్లు, వంటి అనేక ఉత్పత్తులు చేస్తోందన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కుమ్మర వృత్తిదారులు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించిందన్నారు. గుజరాత్ తరహా మట్టి పాత్రల తయారీని తెలంగాణలో ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు.

Related Posts