YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అన్ లాక్ పై కేంద్రాన్ని తప్పుపట్టిన పీకే

అన్ లాక్ పై కేంద్రాన్ని తప్పుపట్టిన పీకే

అన్ లాక్ పై కేంద్రాన్ని తప్పుపట్టిన పీకే
న్యూఢిల్లీ, జూన్ 1,
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. తొలి దశ లాక్‌డౌన్ నాటికి దేశంలో 600గా ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగో దశ ముగిసేనాటికి లక్షా 90వేలు దాటింది. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తరువాత విధించిన లాక్ డౌన్ ను దశలవారీగా పొడిగిస్తూ వచ్చిన కేంద్రం, నేటి నుంచి అన్ లాక్ తొలి దశను ప్రకటించింది. దీనిపై ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్ చేశారు. కొవిడ్-19 కేసుల సంఖ్యను ఓ మారు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. పరోక్షంగా కేంద్రంపై ప్రశాంత్ విమర్శలు గుప్పించారు.లాక్ డౌన్ తొలి దశ నుంచి అన్ లాక్ 1.0 మధ్య కరోనా కేసులు 1002 రెట్లు, మరణాలు 1,348 రెట్లు పెరిగాయని అన్నారు. ప్రపంచంలోనే కేసుల సంఖ్యలో 7వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో భారత్ ఉందని అన్నారు. టెస్టుల తరువాత పాజిటివ్ వస్తున్న కేసుల శాతం 1.3 నుంచి 5 శాతానికి పెరిగిందని, కేసులు నమోదైన జిల్లాల సంఖ్య 68 నుంచి 634కు చేరిందని తెలిపారు. జీ-20 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదల విషయంలో రెండో స్థానంలోనూ, మరణాల పెరుగుదలలో 4వ స్థానంలోనూ ఇండియా ఉందన్నారు. మార్చి 20 నాటికి 190 కేసులున్న దేశంలో జూన్ 1 నాటికి 1,90,535 కేసులు వచ్చాయన్నారు.దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశలోకి ప్రవేశించలేదని ప్రభుత్వం చెబుతోంది.. కానీ, నిపుణులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ ఇప్పటికే పెద్ద ఎత్తున్న సామూహిక వ్యాప్తి దశలోకి చేరిందని అంటువ్యాధి నిపుణుల సంఘాలు, ప్రజారోగ్య నిపుణులు, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ నిపుణులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలుచేసిన సమయంలో వైరస్ అదుపులోనే ఉందని, సడలింపుల తర్వాత తీవ్రత ఎక్కువయ్యినట్టు అర్ధమవుతోందని పేర్కొన్నారు.

Related Posts